గడ్డం పెంచితే డేంజర్ అంటున్న తాజా అధ్యయనం

గడ్డం పెంచితే డేంజర్ అంటున్న తాజా అధ్యయనం
x
Highlights

గ‌డ్డం పెంచుకునే వారికి తాజా అధ్య‌య‌న‌ ఒకటి షాకింగ్ విష‌యాన్ని వెల్ల‌డించింది. శున‌కాల వెంట్రుకల కంటే పురుషుల గ‌డ్డంలోనే ఎక్కువ క్రిములు...

గ‌డ్డం పెంచుకునే వారికి తాజా అధ్య‌య‌న‌ ఒకటి షాకింగ్ విష‌యాన్ని వెల్ల‌డించింది. శున‌కాల వెంట్రుకల కంటే పురుషుల గ‌డ్డంలోనే ఎక్కువ క్రిములు ఉంటున్న‌ట్లు తేల్చింది. ఆ అధ్య‌య‌నం పూర్తి సారంశమెంటో ఓసారి చూద్దం

ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఇప్పుడు గ‌డ్డం (బియ‌ర్డ్‌) ప్రేమికులు పెరిగిపోతున్నారు. రకరకాల షేపుల్లో గ‌డ్డం పెంచుతున్నారుయుత్. గ‌డ్డం త‌మకు స్టైలీష్ లుక్ ఇస్తుందని చాలామంది విశ్వ‌సిస్తుంటారు. అందుకే దానికి యూత్ ఈ మధ్య చాలా ప్రాధాన్య‌మిస్తున్నారు. ఆరోగ్య‌ప‌రంగా చూస్తే మాత్రం గ‌డ్డంతో ఇబ్బందులు త‌ప్ప‌వ‌ని అధ్య‌య‌న‌ం హెచ్చ‌రించింది.పురుషుల గ‌డ్డం క్రిముల‌కు అడ్డాగా ఎలా మారుతోందో తెలుసుకునేందుకు స్విట్జ‌ర్లాండ్ చెందిన హిర్ స్లాండెన్ క్లినిక్ శాస్త్రవేత్త‌లు ఓ అధ్య‌య‌నాన్ని నిర్వ‌హించారు. పరిశోధనల్లో భాగంగా ఎంఆర్ఐ స్కాన‌ర్ లోకి శున‌కాలను పంపారు. త‌ర్వాత మ‌రో రెండు స్కాన‌ర్ల‌లోకి గ‌డ్డం ఉన్న వ్య‌క్తుల‌ను పంపి ప‌రిశీలించారు. శాస్త్రవేత్తల బృందం ప‌రిశీల‌న‌లో షాకింగ్ విష‌యాలు వెలుగులోకి వ‌చ్చాయి. శున‌కాలతో పోలిస్తే పురుషుల గ‌డ్డంలోనే ఎక్కువ‌గా క్రిములు ఉంటున్న‌ట్లు తేలింది. వీటితో అనేక అనారోగ్య స‌మ‌స్య‌లు త‌లెత్త‌ాయని తెలిపారు.

కావున గ‌డ్డాన్ని వీలైనంత త‌క్కువ పెంచుకుంటే మంచిదని సూచించారు. ఈ అధ్య‌య‌న వివ‌రాలు యురోపియ‌న్ రేడియాల‌జీ మెడిక‌ల్ జ‌ర్న‌ల్ లో ప్ర‌చురిత‌మ‌య్యాయి.

ఈ అధ్య‌య‌న ఫ‌లితాల‌ను చూసి మ‌రీ కంగారు ప‌డాల్సిందేమీ లేద‌ని బియ‌ర్డ్ లిబ‌రేష‌న్ ఫ్రంట్ సంస్థ‌కు చెందిన కీత్ ఫ్లెట్ చెబుతున్నారు. ఈ పరిశోధనలో కేవలం 18 మంది పురుషులు, 30 శున‌కాల‌పైనే స్విస్ శాస్త్రవేత్త‌లు ప‌రిశోధ‌న చేప‌ట్టార‌ని ఆయన తెలిపారు. అధ్య‌య‌న ఫ‌లితాల‌ను అందరికి ఆపాదించ‌డం స‌రికాద‌ని సూచిస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories