ఎవరి రీనా ద్వివేది ?

ఎవరి రీనా ద్వివేది ?
x
Highlights

అందానికి లోకం దాసోహం అంటే ఇదేనేమో బహుశా .. రీనా ద్వివేది కొన్నాళ్ళ పాటు ఆమె ఎవరికీ తెలియదు. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఆమె కనిపిస్తుంది...

అందానికి లోకం దాసోహం అంటే ఇదేనేమో బహుశా .. రీనా ద్వివేది కొన్నాళ్ళ పాటు ఆమె ఎవరికీ తెలియదు. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఆమె కనిపిస్తుంది . లేత పసుపు రంగు చీర, స్లీవిలేస్ జాకెట్ , కళ్ళకి అద్దాలు ధరించి చూపు తిప్పుకొని అందంతో అందరిని కట్టిపడేసింది . ఓ చేతితో సెల్ ఫోన్ మరో చేతితో ఈవిఎం ఉన్న బాక్స్ ని పట్టుకొని ర్యాంప్ పై క్యాట్ వాక్ చేస్తూ మోడల్ ని తలదన్నేలా కనిపించింది ఈ అధికారి .. దీనితో ఆమె ఓవర్ నైట్ స్టార్ట్ అయిపోయారు ..

ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంలో పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ లో జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నారు రీనా ద్వివేది .ఎన్నికలలో భాగంగా లక్నోకి యాబై కిలోమీటర్ల దూరంలో ఉన్న నగ్రం అనే పోలింగ్ బూత్ లో ఎన్నికల విధుల్లో పాల్గొన్నారు . పోలింగ్ కి ముందు రోజు ఈవిఎంలను తీసుకువెళ్తున్న సమయంలో ఓ ఫోటో గ్రాఫర్ ఆమె ఫోటో తీసి ఇంటర్నెట్ లో పోస్ట్ చేసాడు .

అ అందానికి ఫిదా అయిన నేటిజన్స్ ఆమె ఎవరు అని గూగుల్ లో వెతకడం మొదలు పెట్టారు .అలా మొత్తానికి ఆమె ఎవరు అనేది మాత్రం ఈ లోకానికి తెలిసింది . దీనితో ఆమెకి ఇప్పుడు పిచ్చ ఫాన్స్ ఫాలోయింగ్ పెరిగింది . ఇలాంటి ఎన్నికల అధికారి బూతింగ్ ల వద్ద ఉంటె ప్రతి ఒక్కరు తమ వోటు హక్కును వినియోగించుకుంటారని నేటిజన్స్ తమ సృజనాత్మకత తో కామెంట్స్ చేస్తున్నారు .

Show Full Article
Print Article
Next Story
More Stories