దుమ్మెత్తిపోస్తే దులుపుకోవాలా? : లోకేష్

Submitted by arun on Tue, 03/20/2018 - 15:18
pklokesh

పవన్ కల్యాణ్‌ తీరును ఏపీ మంత్రి నారా లోకేష్ తప్ప పట్టారు. తనపై పవన్ దుమ్మెత్తిపోస్తే దులుపుకు పోవాలా అని విలేకరులతో చిట్ చాట్‌లో ప్రశ్నించారు. నిరాధారమైన ఆరోపణలకు స్పందించాల్సిన అవసరం లేదన్న లోకేష్..అహహర్నిశలు కష్టపడుతున్న సీఎంకు పవన్ రేటింగ్ ఇస్తారా అని లోకేష్ నిలదీశారు. శేఖర్ రెడ్డికి తనకు లింకు పెట్టి పవన్ చివరికి యూటర్న్ తీసుకున్నారని విమర్శించారు. ముందు శేఖర్ రెడ్డికి తనకు సంబంధాలున్నాయని గుంటూరు సభలో ఆరోపించారనీ తర్వాత శేఖర్ రెడ్డి అంశాన్ని ఎవరో అనుకుంటుంటే చెప్పారంటూ ఓ టీవీ ఛానల్ లో మాట మార్చారని గుర్తు చేశారు. తాతకు చెడ్డ పేరు తెస్తున్నానని పవన్ అనడం బాధ కలింగించిందనీ కానీ తాను చాలా పద్దతిగా, క్రమశిక్షణతో పెరిగానని లోకేష్ అన్నారు. 
 

English Title
Nara Lokesh Fires On Pawan Kalyan

MORE FROM AUTHOR

RELATED ARTICLES