పవన్‌ విమర్శలకు నారా లోకేశ్ కౌంటర్

పవన్‌ విమర్శలకు నారా లోకేశ్ కౌంటర్
x
Highlights

జనసేన అధినేత పవన్‌కల్యాణ్ ఆరోపణలపై మంత్రి నారా లోకేశ్ ట్విట్టర్ ద్వారా కౌంటర్ ఇచ్చారు. పరిశ్రమలు పెట్టేందుకు ముందుకొచ్చిన స్థానిక పారిశ్రామికవేత్తలకు...

జనసేన అధినేత పవన్‌కల్యాణ్ ఆరోపణలపై మంత్రి నారా లోకేశ్ ట్విట్టర్ ద్వారా కౌంటర్ ఇచ్చారు. పరిశ్రమలు పెట్టేందుకు ముందుకొచ్చిన స్థానిక పారిశ్రామికవేత్తలకు భూములు ఇవ్వకుండా… చంద్రబాబు సర్కార్‌ విదేశీయులకు కట్టబెడుతోందంటూ విశాఖ జిల్లాలో శుక్రవారం పవన్‌కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై రియాక్ట్ అయ్యారు మంత్రి నారా లోకేష్. పవన్ చేసిన ఆరోపణలకు సంబంధించిన వీడియోని పోస్ట్ చేస్తూ… ఎవరికి, ఎక్కడ భూములు కేటాయించామో వివరించారు. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టి, ఉద్యోగాలు సృష్టించాలనుకునేవాళ్లకి ఎర్రతివాచీ వేసి స్వాగతం పలుకుతామని, అలాంటివాళ్లని స్వయంగా ఆహ్వానించి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నానని తెలిపారు.

ఫ్రాంక్లిన్‌ టెంపుల్టన్‌ ఫార్చూన్‌- 500 కంపెనీల్లో ఒకటని, రూ.450 కోట్ల పెట్టుబడి పెట్టి 2400 మందికి ఉద్యోగాలు ఇవ్వబోతోందన్నారు మంత్రి. అంతేగానీ, రియల్‌ ఎస్టేట్‌ కంపెనీలకు ప్రభుత్వం భూములు ఇవ్వలేదన్నారు. విశాఖపట్నంలో పల్సస్‌ టెక్‌ సంస్థకి ప్రభుత్వం భూమి కేటాయించిందని, ఆ కంపెనీ సీఈవో శ్రీనుబాబుది శ్రీకాకుళమేనని వివరించారు. స్థానిక పారిశ్రామికవేత్తలకు అన్యాయం జరుగుతోందని అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు మంత్రి లోకేష్.

@PawanKalyan Garu, @FTI_US is a Fortune 500 company that will invest Rs. 450 Cr, provide 2,500 high-end jobs. They are not a real estate co. BTW Pulsus has been allotted land in Vizag to start a tech company and the CEO Srinubabu hails from Srikakulam.

— Lokesh Nara (@naralokesh) June 9, 2018

Anyone willing to invest and create jobs in AP will be given a red carpet welcome without the red tape. And I will personally receive them and handhold them to realize their business goals. AP didn’t become No. 1 in EoDB for nothing. pic.twitter.com/MU5nm7h1Cv

— Lokesh Nara (@naralokesh) June 9, 2018
Show Full Article
Print Article
Next Story
More Stories