ఇది మహానాడు చరిత్రలో మరో రికార్డు: మంత్రి లోకేష్

Submitted by arun on Tue, 05/29/2018 - 17:22
nara lokesh

బీజేపీ, వైసీపీ కుమ్మక్కయ్యాయని తాను ఎప్పటి నుంచో చెప్తున్నానన్నారు ఏపీ మంత్రి లోకేశ్. బీజేపీని శత్రువని ముందే చెప్పానని తెలిపారు. మహానాడుకు గతేడాది కంటే 33 శాతం ఎక్కువగా వచ్చారన్న ఆయన.. ఇది మహానాడు చరిత్రలోనే మరో రికార్డు అన్నారు. టీడీపీకి వ్యతిరేకంగా కుట్ర జరుగుతోందన్న భయం.. కార్యకర్తల్లో కనిపిస్తోందని.. మంత్రి లోకేశ్ మీడియాతో జరిగిన చిట్‌చాట్‌లో చెప్పారు. పార్టీని రక్షించుకోవాలన్న తపన కార్యకర్తల్లో ఉందని.. నేతల్లో ఉన్న నిరుత్సాహం తొలగిస్తున్నామని చెప్పారు లోకేశ్.

దేశంలో ఒక్క నెలలోనే వెయ్యి కోట్లకు పైగా ఉపాధి హామీ పనులు పూర్తి చేసి.. ఏపీ రికార్డ్ సృష్టించిందన్నారు. నాలుగేళ్లలో.. 16 వేల కిలోమీటర్ల రోడ్లు వేశామని చెప్పారు. ఈ ఏడాది మరో 10 వేల కిలోమీటర్ల రోడ్లు వేయడమే తమ లక్ష్యమన్నారు లోకేశ్. కాంగ్రెస్ హయాంలో కేవలం 11 వందల కిలోమీటర్ల రోడ్లే వేశారని లోకేశ్ తెలిపారు. ప్రాంతీయ పార్టీలన్నీ ఒక్కతాటిపైకి వస్తున్నాయని మంత్రి లోకేష్‌ అన్నారు. సంకీర్ణ ప్రభుత్వంలోనే అభివృద్ధి బాగా జరుగుతుందని అన్నారు. బీజేపీ పాలనలో అభివృద్ధి దిగజారిందని... ఏక పార్టీ పాలనతో ప్రయోజనం లేదన్నారు. 

English Title
Nara Lokesh Chit Chat with Media

MORE FROM AUTHOR

RELATED ARTICLES