నన్ను దోచుకొందువటే వన్నెల దొరసాని!

నన్ను దోచుకొందువటే వన్నెల దొరసాని!
x
Highlights

నన్ను దోచుకొందువటే వన్నెల దొరసాని అనే పాట మీరు వినే వుంటారు... అయితే ఇది డా.సి.నారాయణరెడ్డి గారి మొదటి సినిమా అని మీకు తెలుసా. ఈ సినిమాకు గాను ఆయన...

నన్ను దోచుకొందువటే వన్నెల దొరసాని అనే పాట మీరు వినే వుంటారు... అయితే ఇది డా.సి.నారాయణరెడ్డి గారి మొదటి సినిమా అని మీకు తెలుసా. ఈ సినిమాకు గాను ఆయన రాసిన మొదటి పాట ఇది. ఈ నన్ను దోచుకొందువటే వన్నెల దొరసాని ..అను ఈ పాట గులేబకావళి కథ (1962) సినిమాలోనిది. ఇందులో ఎన్.టి. రామారావు మరియు జమున కలిసి నటించారు. ఈ సినిమాలోని పాటలన్నీ దాదాపుగా ఘంటసాల మరియు పి.సుశీల గారు కలిసి ఆలపించారు. డా.సి.నారాయణరెడ్డి గారు ఈ సినిమా పాటలకు సాహిత్యాన్ని అందించారు. అందరూ పాడుకునేలా సరళమైన పదాలతో, ఎంతో అర్ధం వచ్చేలా రాశారు.
పల్లవి:

నన్ను దోచుకొందువటే వన్నెల దొరసాని ...

కన్నులలో దాచుకొందు నిన్నే నా స్వామి .... నిన్నే నా స్వామి

నన్ను దోచుకొందువటే.........
చరణం 1 :

ఆమె:

తరియించును నీ చల్లని చరణమ్ముల నీడలోన

తరియించును నీ చల్లని చరణమ్ముల నీడలోన

పూల దండవోలే ...కర్పూర కళికవోలె... కర్పూర కళిక వోలె...
అతడు:

ఎంతటి నెరజాణవు... నా అంతరంగమందు నీవు

ఎంతటి నెరజాణవు... నా అంతరంగమందు నీవు

కలకాలము వీడని సంకెలలు వేసినావు...సంకెలలు వేసినావు

నన్ను దోచుకొందువటే.........

నన్ను దోచుకొందువటే వన్నెల దొరసాని ...

కన్నులలో దాచుకొందు నిన్నే నా స్వామి .... నిన్నే నా స్వామి

చరణం 2 :

ఆమె:

నా మదియే మందిరమై... నీవే ఒక దేవతవై

నా మదియే మందిరమై... నీవే ఒక దేవతవై

వెలసినావు నాలో నే కలిసిపోదు నీలో....కల్సిపోదు నీలో
అతడు:

ఏనాటిదో మమ బంధం..... ఎరుగరాని అనుబంధం

ఏనాటిదో మమ బంధం..... ఎరుగరాని అనుబంధం

ఎన్ని యుగాలైనా ఇది ఇగిరిపోని గంధం....ఇగిరిపోని గంధం...

నన్ను దోచుకొందువటే.........

నన్ను దోచుకొందువటే వన్నెల దొరసాని ...

కన్నులలో దాచుకొందు నిన్నే నా స్వామి .... నిన్నే నా స్వామి

నన్ను దోచుకొందువటే.........

ఇప్పటివరకు ఈ పాట వినకుంటే ఒక సారి వినండి, మీ మనసుని కూడా దోచుకుంటుంది ఈ పాట. శ్రీ.కో.

Show Full Article
Print Article
Next Story
More Stories