టీడీపీకి సోము వీర్రాజే కరెక్ట్..

Submitted by arun on Mon, 04/02/2018 - 17:36
assembly lobby

ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ లాబీలో సోమవారం ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. మంత్రి కళా వెంకట్రావు, మాజీ మంత్రి, భాజపా నేత మాణిక్యాలరావు, రాష్ట్ర మహిళా ఛైర్‌పర్సన్‌ నన్నపనేని రాజకుమారి మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. కొత్త శత్రువులకు నమస్కారం అంటూ.. నవ్వుతూ మాణిక్యాలరావును కళా వెంకట్రావు పలకరించారు. అడ్వాన్స్ కంగ్రాట్స్ అంటూ.. మాణిక్యాలరావుకు నన్నపనేని అభినందనలు తెలిపారు. అంతేకాకుండా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్నికపై సరదాగా మాట్లాడుకున్నారు. తాను ఏపీ బీజేపీ అధ్యక్షుడిని కావడం లేదని, సోము వీర్రాజు అవుతున్నారని, వీర్రాజును తానే ప్రతిపాదించానని ఆయన చెప్పారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాణిక్యాలరావే అని అంటున్నారని నన్నపనేని అన్నారు. టీడీపీకి సోము వీర్రాజు అయితేనే సరిపోతాడంటూ... నవ్వుకుంటూ
మాణిక్యాలరావు వెళ్లిపోయారు. 

English Title
nannapaneni rajakumari manikyalarao chit chat assembly lobby

MORE FROM AUTHOR

RELATED ARTICLES