నానికే దొరకని ‘ఎంసీఏ’ టికెట్స్ ..!

Submitted by arun on Fri, 12/22/2017 - 15:31
MCA movie

నేచురల్‌ స్టార్‌ నాని ఈ ఏడాది మూడు సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చాడు. మొదటి రెండు సినిమాలు భారీ విజయాలను తెచ్చిపెట్టాయి. మూడవ సినిమాగా 'మిడిల్ క్లాస్ అబ్బాయి'తో నిన్ననే ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాలో నటన పరంగా నాని మంచి మార్కులు కొట్టేశాడనే టాక్ వినిపిస్తోంది. ఎంసీఏ సినిమాలో విలన్ గా చేసిన నటుడు నానిని ఓ మూడు టికెట్లు అడిగాడట. దాంతో థియేటర్ మేనేజర్ కి ఫోన్ చేశాడట నాని .. ఫోన్ రింగ్ అవుతున్నా, ఎంత సేపటికీ ఆయన ఫోన్ తీయలేదు. కొద్ది సేపటి తరువాత రిసీవ్ చేసుకుని .. తాను టికెట్లు అడగ్గానే "ఇప్పుడు అడగొద్దు సార్" అని థియేటర్ ఓనర్ అన్నాడని నాని చెప్పుకొచ్చాడు. అంతేకాదు ఈ సినిమాకి ఈ స్థాయిలో వస్తోన్న రెస్పాన్స్ చూసి తనకే ఆశ్చర్యం వేస్తోందట. తన సినిమాకి ఈ స్థాయి వసూళ్లు వస్తున్నాయా? అని షాక్ కూడా అవుతున్నాడట మన మిడిల్ క్లాస్ అబ్బాయి.

English Title
Nani did not get movie tickets

MORE FROM AUTHOR

RELATED ARTICLES