'c/o సూర్య‌'పై నాని కేర్‌

c/o సూర్య‌పై నాని కేర్‌
x
Highlights

యువ క‌థానాయ‌కుడు సందీప్ కిష‌న్ న‌టిస్తున్న ద్విభాషా చిత్రం 'c/o సూర్య‌'. మెహ‌రీన్ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రానికి 'నా పేరు శివ' ఫేమ్ సుశీంద్ర‌న్...

యువ క‌థానాయ‌కుడు సందీప్ కిష‌న్ న‌టిస్తున్న ద్విభాషా చిత్రం 'c/o సూర్య‌'. మెహ‌రీన్ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రానికి 'నా పేరు శివ' ఫేమ్ సుశీంద్ర‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన టీజ‌ర్‌ని నేచుర‌ల్ స్టార్ నాని ఈ సోమ‌వారం ఉద‌యం 11 గంట‌ల‌కు త‌న ఫేస్‌బుక్‌, ట్విట్ట‌ర్ ఖాతాల ద్వారా విడుద‌ల చేయ‌నున్నారు. ఈ విష‌యాన్ని సందీప్ కిష‌న్ త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో చెప్పుకొచ్చారు.

'c/o సూర్య' టీజ‌ర్‌ని నాని కేర్‌గా విడుద‌ల చేయ‌బోతున్నారు.. అంటూ ఆయ‌న అందులో పేర్కొన్నారు. డి.ఇమాన్ సంగీత‌మందిస్తున్న ఈ చిత్రాన్ని ల‌క్ష్మీ న‌ర‌సింహా ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై చ‌క్రి చిగురుపాటి నిర్మిస్తున్నారు. వ‌చ్చే నెల‌లో ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories