టీడీపీలో మరోసారి వర్గ విభేదాలు...సీఎం రమేశ్‌ వైసీపీతో టచ్‌లో ఉన్నారని...

Submitted by arun on Tue, 07/31/2018 - 10:36

కడప జిల్లా తెలుగుదేశం పార్టీలో వర్గ విభేదాలు మరోసారి భగ్గుమన్నాయ్. ఎన్నికలు సమీపిస్తున్న వేళ నేతలు రచ్చకెక్కడంతో పార్టీ అధ్యక్షుడికి కొత్త తలనొప్పులు మొదలయ్యాయ్. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు నేతలకు సర్ది చెబుతున్నా లెక్కలోకి తీసుకోవడం లేదు. నేతల మధ్య విభేదాలతో పార్టీ పరువు బజారున పడుతోంది. 

కడప జిల్లా టీడీపీలో అంతర్గత కలహాలు మరోసారి రచ్చకెక్కాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నిసార్లు సర్దిచెప్పినా నేతలు మళ్లీమళ్లీ గాడి తప్పుతున్నారు. కలిసి పని చేయాలని చెబుతున్నా చంద్రబాబు వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకోవడం లేదు. రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్‌పై వరదరాజులురెడ్డి మరోసారి తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. ఇద్దరి మధ్య విభేదాలతో పార్టీ పరువు బజారున పడుతోంది. 

సీఎం రమేష్‌కు దమ్ముంటే పులివెందులలో పాలిటిక్స్‌ చేయాలని వరదరాజులరెడ్డి సవాల్ విసిరారు. సీఎం చంద్రబాబు దయతో రమేష్‌ ఎంపీ అయ్యారని, వైసీపీతో సీఎం రమేశ్‌కు సత్సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు. గ్రామస్థాయికి ఎక్కువ మండలానికి తక్కువ అంటూ విమర్శించారు. గ్రూపు రాజకీయాలతో నాలుగైదు స్థానాల్లో గెలుపు అవకాశాలను చెడగొడుతున్నారని వరదరాజులురెడ్డి దుయ్యబట్టారు.

సీఎం రమేష్‌ను వరదరాజురెడ్డి టార్గెట్ చేయడం ఇదేం తొలిసారి కాదు. గతంలో తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. వైసీపీకి రమేష్‌ మద్దతుదారుడని వరదరాజులురెడ్డి ఆరోపణలు చేశారు. ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచే సత్తాలేని రమేష్‌ గ్రూప్‌ రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. కుందూ-పెన్నా వరద కాలువ పనుల్లో ఐదుశాతం మామూళ్లు ఇవ్వాలని సీఎం రమేష్‌ డిమాండ్‌ చేసినట్లు ఆరోపించారు. 
 

English Title
Nandyala Varada Rajulu Reddy Targets CM Ramesh

MORE FROM AUTHOR

RELATED ARTICLES