ఈ కోరిక చిన్నప్పటినుంచీ ఉంది : సుహాసిని

Submitted by nanireddy on Fri, 11/16/2018 - 20:07
nandamuri-suhasini-press-meet

తెలంగాణ ఎన్నికల్లో ఊహించని విధంగా రాజకీయరంగ ప్రవేశం చేసిన హరికృష్ణ కుమర్తె సుహాసిని ఎట్టకేలకు మీడియా ముందుకు వచ్చారు. ఈ సందర్బంగా ప్రజలకు సేవ చేయాలన్న ఉద్దేశంతోనే తాను రాజకీయాల్లోకి వచ్చినట్టు సుహాసిని చెప్పారు. కూకట్‌పల్లి నుంచి పోటీ చేస్తుండటం గర్వంగా ఉందని.. తాత ఎన్టీఆర్‌, నాన్న హరికృష్ణ స్ఫూర్తితో రాజకీయాల్లో వస్తున్నానని అన్నారు. ఇక ఇపప్టినుంచి తన తాత లాగ ప్రజల కోసం కష్టపడతానన్నారు. 
 
తనపై ఎంతో నమ్మకంతో ఈ సీటు ఇచ్చినందుకు టీడీపీ అధిష్టానానికి ఆమె కృతజ్ఞతలు తెలియజేశారు. రాజకీయాల్లోకి రావాలన్న కోరిక చిన్నప్పటి నుంచే తనకు ఉందని సుహాసిని చెప్పారు. కాగా అన్ని ప్రశ్నలకు రేపు సమాధానం చెబుతానని అన్నారు. అలాగే రేపు తాను నామినేషన్ వేస్తానని అన్నారు. ఇదిలావుంటే రాజకీయాల్లోకి రావాలన్నది ఎవరి నిర్ణయం? ప్రచారానికి జూనియర్‌ ఎన్టీఆర్‌, కళ్యాణ్‌రామ్‌ వస్తారా? అని అడగ్గా రేపు అన్ని చెబుతానని సుహాసిని వెల్లడించారు.

English Title
nandamuri-suhasini-press-meet

MORE FROM AUTHOR

RELATED ARTICLES