హరికృష్ణ విగ్రహం సిద్ధం.. రేపు ఎన్టీయార్‌కు అందజేత

Submitted by arun on Sat, 09/01/2018 - 15:34
nandamuri harikrishna

తెలుగుదేశం సీనియర్ నేత, సినీ నటుడు నందమూరి హరికృష్ణ ఇటీవల జరిగిన కారు ప్రమాదంలో కన్నుముూసిన సంగతి తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వం హరికృష్ణ అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించింది. కాగా, సెప్టెంబర్ 2న హరికృష్ణ జయంతి సందర్భంగా ఇద్దరు నందమూరి అభిమానులు ఆయన విగ్రహాన్ని రూపొందించారు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం నత్తారామేశ్వరానికి చెందిన ఏకేఆర్ట్స్ శిల్పులు డాక్టర్ పెనుగొండ అరుణ్ ప్రసాద్ ఉడయార్, కరుణాకర్ ఉడయార్‌లు హరికృష్ణ మీద అభిమానంతో ఆయన విగ్రహాన్ని రూపొందించారు. రేపు(సెప్టెంబర్ 2) హరికృష్ణ తొలి జయంతి సందర్భంగా ఈ విగ్రహాన్ని ఆయన చిన్న కుమారుడు, ప్రముఖ సినీ హీరో జూనియర్ ఎన్టీఆర్‌కు అందజేయనున్నట్లు విగ్రహ రూపకర్తలు తెలిపారు.

English Title
nandamuri harikrishna statue has made by his fans

MORE FROM AUTHOR

RELATED ARTICLES