ఇతన్ని ప్రేమిస్తున్నా: నమ్రత

ఇతన్ని ప్రేమిస్తున్నా: నమ్రత
x
Highlights

తన భర్త మహేశ్‌ బాబుపై ఉన్న ప్రేమను సినీ నటి నమ్రతా శిరోద్కర్ ఇన్ స్టా గ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకుంది. 'భరత్ అనే నేను' సినిమా షూటింగ్ లో మహేష్...

తన భర్త మహేశ్‌ బాబుపై ఉన్న ప్రేమను సినీ నటి నమ్రతా శిరోద్కర్ ఇన్ స్టా గ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకుంది. 'భరత్ అనే నేను' సినిమా షూటింగ్ లో మహేష్ బాబు బిజీగా ఉండగా... అతని ఫొటోను ఇన్ స్టా గ్రామ్ లో పోస్టు చేసిన నమ్రత 'ఐ లవ్ దిస్ మేన్' అని పేర్కొంది. దీంతో అభిమానులు ఆనందంతో రెచ్చిపోయారు.

‘వంశీ’ సినిమాలో హీరో హీరోయిన్లుగా నటించిన మహేష్ బాబు, నమ్రత ఒకరినొకరు ప్రేమించుకొని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఎంతో అన్యూన్యంగా సాగిపోతున్న ఈ దంపతులకు కొడుకు గౌతమ్, కూతురు సితార జన్మించారు. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ తన భర్త సినిమా ముచ్చట్లను, కుటుంబ సంగతులను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకునే నమ్రత తాజాగా మహేష్ ఫోటోను షేర్ చేసి ‘ఇతన్ని ప్రేమిస్తున్నా’ అంటూ మరోసారి మహేష్‌పై తనకున్న ప్రేమను చాటిచెప్పింది. ఎంతో అట్రాక్టివ్‌గా ఉన్న మహేష్ ఫోటో చూసి ‘మేము కూడా ప్రేమిస్తున్నాం’ అని కొందరు కామెంట్స్ పెట్టగా, ‘నమ్రత నీవు నిజంగా అదృష్టవంతురాలివి’ అని మరికొందరు కామెంట్ చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories