బీజేపీ - టీడీపీ మైత్రికి చెల్లు చీటి పడుతోందా?

బీజేపీ - టీడీపీ మైత్రికి చెల్లు చీటి పడుతోందా?
x
Highlights

బీజేపీ, టీడీపీ మైత్రికి చెల్లు చీటి పడుతోందా? దశల వారీగా టీడీపీపై ఒత్తిడి పెంచుతున్న బీజేపీ..ఆక్రమంలో ఎక్కడా తప్పు తమపై లేకుండా చూసుకుంటోందా?ఇచ్చిన...

బీజేపీ, టీడీపీ మైత్రికి చెల్లు చీటి పడుతోందా? దశల వారీగా టీడీపీపై ఒత్తిడి పెంచుతున్న బీజేపీ..ఆక్రమంలో ఎక్కడా తప్పు తమపై లేకుండా చూసుకుంటోందా?ఇచ్చిన నిధులకు లెక్కలడగడం సరికాదని మేధావులు చెబుతున్నా.. బీజేపీ అదే ధోరణిలో ముందుకు సాగడం చూస్తుంటే.. అమీ తుమీకి సిద్ధమవుతోందనుకోవాలా?

కేంద్ర బడ్జెట్లో ఏపి కేటాయింపులపై రేగిన గొడవ మొత్తం మీద అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వ అధికారులలో కదలిక తెచ్చింది. ఏపిలో రేగుతున్న రాజకీయ అలజడిని గుర్తించిన కేంద్రం తమ పార్టీ పరంగా డ్యామేజి కాకుండా చూసుకునేలా అడుగులు వేస్తోందా? అటెన్షన్ తిరిగి తిరిగి మళ్లీ హోదా మీదకు పోకముందే నిధుల పంచాయతీకి శుభం కార్డు పడేలా అడుగులేస్తోందా? లేక గణాంకాల గజిబిజితో రాష్ట్రాన్ని ఇరుకున పెట్టాలని చూస్తోందా? ఇచ్చిన నిధులు, విభజన హామీల వివరాలతో ఈనెల 21న ఢిల్లీకి రావాలంటూ కేంద్రం రాష్ట్రానికి కబురు పెట్టడం చూస్తుంటే.. కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైనట్లే కనిపిస్తోంది. ఈనెల 21,22 తేదీల్లో రెండు రోజులూ సమావేశాలు ఉంటాయని కేంద్రం నుంచి రాష్ట్రానికి వర్తమానం అందింది. కేంద్ర సంస్థల నిర్మాణానికి నిధులు, కడప ఉక్కు కర్మాగారం, దుగరాజు పట్నం పోర్టుకు ప్రత్యామ్నాయ పోర్టు సంబం ధించిన పత్రాలతో రావాలంటూ కేంద్రం పిలుపు పెట్టింది. దాంతో ఎలర్ట్ అయిన చంద్రబాబు ఇప్పటి వరకూ అందిన నిధుల వివరాలతో కూడిన నివేదికను వెంటనే రెడీ చేయాలంటూ అధికారులను ఆదేశించారు.. ఇదే మీటింగ్ లో విభజన చట్టం హామీల అమలుపై షీలా బిడే కమిటీతో చర్చలు కూడా జరుగుతాయి.

మరోవైపు ఇన్నాళ్లూ ఏపిపై సవతి తల్లి ప్రేమ చూపించిన మోడీ ఇప్పుడు ఏపికి రావాలని తహతహలాడుతున్నారట. అందుకే ప్రధాని స్థాయిలో ప్రారంభించాల్సిన పథకాలు, ప్రాజెక్టులు, శంకుస్థాపనలేమైనా ఉంటే వాటికి సిద్ధంగా ఉండాలని, వాటి వివరాలు ఇవ్వాలనీ పిఎంఓ నుంచి రాష్ట్రానికి సంకేతాలందాయి. అంటే తామిచ్చిన నిధులకు తగిన వేగంలో పనులు అవుతున్నాయో లేదో చెక్ చేయడానికే మోడీ వస్తున్నారా అనే సందేహాలు కలుగుతున్నాయి. కేంద్రం వేసిన ఈ ప్రశ్నలకు రాష్ట్రం డైలమాలో పడిపోయింది అమరావతి శంకుస్థాపనకొచ్చిన మోడీ మట్టి, నీళ్లు తో సరిపెట్టిన అనుభవాన్ని గుర్తు చేసుకుని రాష్ట్ర ప్రభుత్వం భయపడుతోంది. మోడీ రాష్ట్రానికొస్తే.. ఏం ప్రకటిస్తారన్న దానిపై స్పష్టత ఉండాలని అందుకే టీడీపీ ప్రభుత్వం మెలిక పెడుతోంది. ప్రధాని సహాయం ఇస్తారా.. ఇస్తే ఎంతిస్తారు ? ఎప్పుడిస్తారు? ఏ రూపంలో ఇస్తారన్న దానిపై క్లారిటీ వచ్చాకే ప్రధాని పర్యటనకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని రాష్ట్రం అనుకుంటోంది. మరోవైపు బీజేపీ నేత సోము వీర్రాజు కూడా టీడీపీని ప్రశ్నించారు.. కేంద్రం విభజన చట్టంలో చెప్పినట్లు కొత్త పరిశ్రమలకు 30 శాతం రాయితీలు కల్పించిందని మరి ఎన్ని పరిశ్రమలు స్థాపించారో లెక్కలివ్వాలని మెలిక పెట్టారు. దీంతో బీజేపీ, టీడీపీ మధ్య పొత్తుపై అమీ, తుమీకి రంగం సిద్ధమవుతోందా? అనే సందేహాలు కలుగుతున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories