సీబీఐ నూతన డైరెక్టర్‌గా తెలుగు అధికారి

సీబీఐ నూతన డైరెక్టర్‌గా తెలుగు అధికారి
x
Highlights

సీబీఐ చీఫ్‌గా తెలుగు వ్యక్తికి ఛాన్స్‌ దక్కింది. సీబీఐలో సంక్షోభం నేపథ్యంలో జాయింట్‌ డైరెక్టర్‌గా ఉన్న మన్నెం నాగేశ్వరరావుకు డైరెక్టర్‌ బాధ్యతలు...

సీబీఐ చీఫ్‌గా తెలుగు వ్యక్తికి ఛాన్స్‌ దక్కింది. సీబీఐలో సంక్షోభం నేపథ్యంలో జాయింట్‌ డైరెక్టర్‌గా ఉన్న మన్నెం నాగేశ్వరరావుకు డైరెక్టర్‌ బాధ్యతలు అప్పగించారు. తాత్కాలిక డైరెక్టర్‌గా మన్నెం నాగేశ్వరరావును నియమిస్తూ ఉత్తర్వలు జారీ అయ్యాయి. మన్నెం స్వస్థలం వరంగల్‌ జిల్లా మంగపేట మండలం బోర్‌నర్సాపూర్. 1986 ఐపీఎస్‌ బ్యాచ్‌కు చెందిన మన్నెం నాగేశ్వరరావు ఒడిశా డీజీపీగా పని చేశారు. అనంతరం సీబీఐ దక్షిణాది రాష్ట్రాల జాయింట్‌ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత ఢిల్లీకి ట్రాన్స్‌ఫర్‌ అయ్యారు. ప్రస్తుతం జాయింట్‌ డైరెక్టర్‌గా ఉన్న మన్నెం నాగేశ్వరరావుకు తాత్కాలిక డైరెక్టర్‌గా బాధ్యతలు అప్పగిస్తూ కేంద్ర అధికారుల పరిపాలన వ్యవహారాలు చూసే డీవోపీటీ ఉత్తర్వులు జారీచేసింది.

సీబీఐ డైరెక్టర్‌ అలోక్‌ వర్మ, ప్రత్యేక డైరెక్టర్‌ రాకేశ్‌ ఆస్థానా మధ్య మొదలైన వర్గ పోరుతో దేశ అత్యున్నత దర్యాప్తు సంస్థపై నీలినీడలు అలుముకున్నాయి. ప్రధాని సీబీఐని భ్రష్టు పట్టిస్తున్నారని విపక్షాలు తీవ్ర ఆరోపణలు చేస్తుండటంతో కేంద్రం దీనిపై దృష్టి సారించింది. రాత్రికి రాత్రే మారిన పరిణామాలతో అలోక్‌ వర్మ, రాకేశ్‌ ఆస్థానాను సెలవుపై వెళ్లాల్సిందిగా ఉన్నత వర్గాలు ఆదేశాలు జారీచేశాయి. పీఎంవోతో పాటు కేంద్ర అధికారుల వ్యవహారాలు చూసే డీవోపీటీ మన్నెం నాగేశ్వరరావును సీబీఐ నూతన డైరెక్టర్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీచేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories