సుధాకర్ రెడ్డి అంటే స్వాతికి ఎందుకు ఇష్టం లేదంటే

Submitted by lakshman on Fri, 12/15/2017 - 11:28

సుధాకర్ రెడ్డి హత్య కేసు విచారణలో స్పీడు పెంచారు పోలీసులు. రాజేష్ ను అరెస్టు చేసిన పోలీసులు, అతను ఇచ్చిన వివరాల ఆధారంగా సుధాకర్ రెడ్డి ఇంట్లో సోదాలు నిర్వహించారు. మహబూబ్ నగర్ నుంచి ప్రత్యేక క్లూస్ టీంను రప్పించి.. రాజేష్ సమక్షంలోనే సుధాకర్ రెడ్డి ఇంట్లో తనిఖీలు చేపట్టారు. ఈ సోదాల్లో కేసుకు సంబంధించి పలు కీలక ఆధారాలను సేకరించారు.  
మొదట జిల్లా పోలీసు హెడ్ క్వార్టర్స్ లో రాజేష్ ను సుదీర్ఘంగా ప్రశ్నించిన పోలీసులు.. స్వాతితో ఎప్పటి నుంచి పరిచయం ఉంది అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. సుధాకర్ రెడ్డిని చంపడానికి వాడిన మత్తు ఇంజెక్షన్, తలపై కొట్టిన రాడ్డు కోసం గాలిస్తున్నారు. 
పోలీసుల విచారణలో రాజేష్ కీలక విషయాలు చెప్పాడు. సుధాకర్ రెడ్డి కుటుంబంతో తనకు ఎలాంటి శత్రుత్వం లేదని విచారణలో తెలిపాడు. స్వాతికి, తన భర్త సుధాకర్ రెడ్డి అంటే ఇష్టం లేదని.. అందుకే తనతో కలిసి హత్యకు ప్లాన్ చేసిందని చెప్పాడు. ఇదిలా ఉంటే భర్త అంటే స్వాతికి ఎందుకు ఇష్టంలేదనే ప్రశ్నకు సమాధానంగా సుధాకర్ రెడ్డి వ్యాపార నిమిత్తం ఇతర ప్రాంతాలకు వెళుతూ తనని పట్టించుకోవడంలేదని స్వాతి తన వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్లు రాజేష్ పోలీసులకు వివరించినట్లు తెలుస్తోంది. అదే సమయంలో క్లీనిక్ నిర్వహిస్తున్న తన వద్దకు స్వాతి తరుచు వచ్చేదని..ఆ పరిచయమే ఇన్ని అనార్ధాలకు దారితీసినట్లైంది. అందుకు స్వాతి, రాజేశ్ కలిసుండేందుకే.. సుధాకర్ ను చంపారని పోలీసులు చెబుతున్నారు. ప్లాస్టిక్  సర్జరీ చేసుకుని సుధాకర్ రెడ్డి స్థానంలో.. రాజేశ్ ను తన భర్తగా తీసుకొచ్చేందుకు స్వాతి ప్లాన్ చేసిందని తెలిపారు. కుటుంబ సమస్యలతో పాటు.. రాజేశ్, స్వాతి మధ్య ఉన్న సన్నిహత సంబంధమే హత్యకు దారితీశాయని చెప్పారు. విచారణ పూర్తి చేసిన తర్వాత కేసుకు సంబంధించి చార్జిషీట్  దాఖలు చేస్తామన్నారు. 
 

English Title
nagar kurnool sudhakar reddy murder case

MORE FROM AUTHOR

RELATED ARTICLES