తెలంగాణలో బీజేపీకి కాంగ్రెస్ షాక్

తెలంగాణలో బీజేపీకి కాంగ్రెస్ షాక్
x
Highlights

తెలంగాణ బీజేపీకి షాకివ్వడానికి కాంగ్రెస్ సిద్ధమవుతోంది. మాజీ మంత్రి నాగం జనార్ధన్ రెడ్డితో పాటు మరికొందరు నేతలు హస్తం పార్టీలో చేరడానికి రెడీ అయ్యారు....

తెలంగాణ బీజేపీకి షాకివ్వడానికి కాంగ్రెస్ సిద్ధమవుతోంది. మాజీ మంత్రి నాగం జనార్ధన్ రెడ్డితో పాటు మరికొందరు నేతలు హస్తం పార్టీలో చేరడానికి రెడీ అయ్యారు. నాగం చేరికకు తేదీ ఖరారు కావడంతో మిగతా నేతలు కూడా ఢిల్లీ వెళ్ళడానికి సిద్ధమవుతున్నారు. దీంతో తెలంగాణ బీజేపీ నేతలు తలలు పట్టుకుంటున్నారు.

మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత నాగం జనార్ధన్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరడానికి రంగం సిద్ధమైంది. ఇటీవల ఢిల్లీ వెళ్లిన కాంగ్రెస్ నేతలు నాగంకు కండువా కప్పాల్సిందిగా AICC అధ్యక్షుడు రాహుల్ గాంధీని కోరినట్టు తెలుస్తుంది. దీనికి ఈ నెల 25న ముహూర్తం నిర్ణయించారు. నాగంతో పాటు మరికొందరికి కాంగ్రెస్ కండువా కప్పేందుకు హస్తం పార్టీ ప్రయత్నిస్తోంది. వీరందరూ ఈ రాత్రి నాగంతో పాటు ఢిల్లీకి బయల్దేరనున్నారు.

ఇంత వరకు బాగానే ఉన్నా అసలు కథ ఇక్కడే మొదలైంది. నాగం తనతో పాటు మరో అరడజను మంది బీజేపీ కీలక నేతలను కాంగ్రెస్‌లోకి తీసుకెళ్తున్నారు. వేములవాడ నియోజకవర్గ ఇన్ చార్జ్ ఆది శ్రీనివాస్, కరీంనగర్ నుంచి పోటీ చేసిన కొత్త జైపాల్ రెడ్డి పఠాన్ చెరువు నుంచి పోటీ చేసిన అంజిరెడ్డి, బీజేపీ మహిళ మోర్చా కార్యదర్శి గోదారి చేరడానికి ఫైనల్ అయింది. వీళ్లంతా స్థానికంగా పట్టున్న నేతలు.

అదిలాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు పాయల్ శంకర్‌ని కూడా కాంగ్రెస్‌లో చేర్చుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆయన గత ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచారు. అయితే ఆయనకు టిక్కెట్ ఇవ్వడంపై హామీ రాకపోవడంతో వెనుకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. దేశంలో బీజేపీ హవా కొనసాగుతున్న సమయంలో తెలంగాణలో మాత్రం కమలం నేతలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారని చెప్పుకోవడానికి భారీ ఆపరేషన్ కు స్కెచ్ వేస్తున్నట్లు తెలుస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories