విదేశీ అతిథులు...మాదాపురం గ్రామానికి వలస వచ్చిన విదేశీ పక్షులు...

విదేశీ అతిథులు...మాదాపురం గ్రామానికి వలస వచ్చిన విదేశీ పక్షులు...
x
Highlights

వేసవి విడిదికి వచ్చిన విదేశీ పక్షులు చెట్ల మీద ఆవాసాలు ఏర్పరచుకుని చూపరులను కనువిందు చేస్తున్నాయి. ఆ గ్రామంలో ఏ చెట్టు మీద చూసినా ఎర్రమూతి కొంగలే...

వేసవి విడిదికి వచ్చిన విదేశీ పక్షులు చెట్ల మీద ఆవాసాలు ఏర్పరచుకుని చూపరులను కనువిందు చేస్తున్నాయి. ఆ గ్రామంలో ఏ చెట్టు మీద చూసినా ఎర్రమూతి కొంగలే కనిపిస్తున్నాయి రెక్కలను చాచుతూ వాలిపోతున్నాయి. తెల్లవారు జాము నుంచి రాత్రి వరకు చిత్ర విచిత్రమైన చప్పుళ్లతో చెట్లపై ముసురుకుంటున్నాయి. పక్షుల సందడితో పులకించిపోతున్నారు.

మహబూబాబాద్ జిల్లా మల్యాల సైబీరియన్ పక్షుల విడిది కేంద్రంగా ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. అయితే ఈ ఏడాది గ్రామంలో చెట్లను కొట్టి వేయడంతో సమీపంలోని మాదాపురం గ్రామానికి వలస వచ్చాయి. వేల కిలో మీటర్లు ప్రయాణం చేసి ఇక్కడికి చేరుకున్న సైబీరియన్ పక్షులు చెట్లపై గూళ్లను అల్లుకున్నాయి. పక్షుల కిలకిల రావాలతో గ్రామంలో సందడి నెలకొందని గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

పొడువాటి ముక్కు నలుపు, తెలుపు, గులాబీ రంగు చర్మంలో ఉండే ఈ పక్షులు ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటున్నాయి. తమ ఊరికి వచ్చిన సైబీరియన్ పక్షులను చూసి ముచ్చటపడుతున్నారు గ్రామస్తులు. ప్రత్యేక అతిధులుగా భావిస్తున్నారు. ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటంతో అల్లాడుతున్న పక్షులకు ఆహారంగా చేపలను పెడుతూ చెట్ల కింద బకెట్లు బేసిన్లలో నీటిని నింపుతూ కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు ఇక్కడి ప్రజలు.

గ్రామానికి రాగానే చెట్ల కొమ్మలపై గూళ్లు ఏర్పాటు చేసుకున్నాయి ఈ సైబీరియన్ పక్షులు. గుడ్లు పెట్టి పొదిగి పిల్లలను కంటున్నాయి. అందమైన కొంగలు తమ గ్రామానికి రావటం అదృష్టంగా భావిస్తున్నారు గ్రామస్తులు. ఊళ్లో అవి చేసే సదడి చూసి సంబురపడుతున్నారు. ఈ సైబీరియన్ పక్షులు ఇబ్బందులు పడకుండా పశు సంవర్ధక శాఖ అధికారులు తగు చర్యలు తీసుకోవాలని పర్యావరణ ప్రేమికులు కోరుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories