నాగచైతన్య.. అలియాస్ నాగేశ్వర్రావు!

Submitted by arun on Mon, 03/12/2018 - 14:07
Savitri biopic

తెలుగులో ఇప్పుడు అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమాల్లో ఒకటి.. మహానటి. సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను.. తమిళ్ లో కూడా నడిగర్ తిలగమ్ పేరుతో షూట్ చేస్తున్నారు. కీర్తీ సురేష్ లీడ్ రోల్ లో.. సమంత, మరికొందరు ప్రముఖులు కీలక పాత్రలో పోషిస్తున్న ఈ సినిమా గురించి.. ఇప్పుడు మరో విషయం బయటికొచ్చింది.

సావిత్రి జీవిత కథ అంటే.. అందులో ఎన్టీఆర్, ఏఎన్నార్ రోల్స్ కూడా ఇంపార్టెన్స్ ఉంటుంది. ఆ దిశగా.. ఎన్టీఆర్ బదులు జూనియర్ ఎన్టీఆర్ ను, నాగేశ్వర్రావు బదులు నాగచైతన్యను అనుకున్నారు. కానీ.. వాస్తవానికి ఆ ప్రతిపాదనను ఇద్దరూ మొదట్లో అంగీకరించలేదు. కానీ.. యూనిట్ ఒత్తిడి చేసిందో.. తానే నిర్ణయం మార్చుకున్నాడో తెలియదు కానీ.. చివరికి చై మాత్రం ఆ ప్రపోజల్ ను ఓకే చేసేశాడట.

అంతే కాదు.. ఈ నెల 14, 15 డేట్స్ ను కూడా షూట్ కు అరేంజ్ చేశాడట. ఈ రెండు రోజుల్లోనే చై పార్ట్ షూట్ పూర్తి అయ్యేలా యూనిట్ కూడా ప్లాన్ చేసిందట. అయితే.. నిజంగానే ఏఎన్నార్ పాత్రలో చై నటిస్తున్నాడా.. లేదంటే రిలేటెడ్ రోల్ ఇంకేదైనా ఉందా అన్న అనుమానం కూడా ఇండస్ట్రీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. అందుకే.. చై నోరు తెరిస్తే తప్ప.. ఈ అనుమానాలకు, ఊహాగానాలకు ఫుల్ స్టాప్ పడేలా లేదు.
 

English Title
Naga Chaitanya Gives Relief To Mahanati

MORE FROM AUTHOR

RELATED ARTICLES