ఎన్టీఆర్ బయోపిక్ : నాదెండ్ల కుటుంబం నోటీసులు
‘ఎన్టీఆర్’ బయోపిక్ పై నాదెండ్ల భాస్కరరావుకుటుంబం అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఈ మేరకు దర్శకుడు క్రిష్, హీరో బాలకృష్ణకు భాస్కరరావు పెద్దకుమారుడు నోటీసులు పంపారు. ఎమ్మెల్యే హోదాను ఉద్దేశించ ఒకటి, నటుడిగా మరొక నోటీసును బాలకృష్ణకు నాదెండ్ల భాస్కరరావు పెద్ద కుమారుడు పంపారు. సినిమాలో తమ పాత్రల గురించి ఎలాంటి అనుమతి తీసుకోలేదని వెల్లడించారు. నెగటివ్ షేడ్‌లో భాస్కరరావును చూపించే ప్రయత్నం చేస్తునట్టు తమకు సమాచారం ఉందని ఆయన చెప్పారు. కాగా, క్రిష్ దర్శకత్వంలో ఎన్‌బీకే ఫిల్మ్స్ పతాకంపై బాలకృష్ణ, సాయి కొర్రపాటి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఇటీవలే గ్రాండ్‌గా ఈ సినిమాను స్టార్ట్ చేసిన బాలకృష్ణ, సినిమా రిలీజ్‌కు కూడా స్పెషల్ డేట్‌ను ఫిక్స్ చేశారు. ఎన్టీఆర్ తొలిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన జనవరి 9నే ఈ సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు. వచ్చే నెలలో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కావాల్సివుంది.
లైవ్ టీవి
దేవ్...వావ్ అయితే కాదు...
15 Feb 2019 11:03 AM GMTయాత్ర డైలాగ్స్ జీవిత సత్యాలు..ముత్యాలుగా నిలిచాయి
14 Feb 2019 7:27 AM GMTచలాకి హీరొయిన్ రాధిక గారు!
12 Feb 2019 6:36 AM GMTవిజయవంతమైన ఎన్నో చిత్రాలు అందించిన విజయ బాపినీడు గారు!
12 Feb 2019 6:10 AM GMTసూత్రధారులు సిన్మాకి సూత్రధారులు
10 Feb 2019 10:05 AM GMT