నా గర్ల్‌ఫ్రెండ్‌తో ఎప్పుడూ గొడవలే : విజయ్‌ దేవరకొండ

నా గర్ల్‌ఫ్రెండ్‌తో ఎప్పుడూ గొడవలే : విజయ్‌ దేవరకొండ
x
Highlights

తక్కువ కాలంలో మొదటి అడుగుల్లోనే లైఫ్ లాంగ్ గుర్తుండి పోయే హిట్ అందుకున్న హీరో విజయ్ దేవరకొండ. అర్జున్ రెడ్డి సినిమా ఏ స్థాయిలో హిట్ అయ్యిందో అందరికి...

తక్కువ కాలంలో మొదటి అడుగుల్లోనే లైఫ్ లాంగ్ గుర్తుండి పోయే హిట్ అందుకున్న హీరో విజయ్ దేవరకొండ. అర్జున్ రెడ్డి సినిమా ఏ స్థాయిలో హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే. సందీప్‌ రెడ్డి వంగ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రేక్షకులకు తెగ నచ్చేసింది. కానీ అర్జున్‌రెడ్డి పాత్రలో నటించిన విజయ్‌కి మాత్రం సమస్యలు తెచ్చిపెట్టిందట. ప్రస్తుతం విజయ్‌ ‘ఏ మంత్రం వేశావె’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో తన అభిప్రాయాలు పంచుకున్నారిలా..

‘అర్జున్‌రెడ్డి’ సినిమా చేసిన తర్వాత నా గర్ల్‌ఫ్రెండ్‌తో ఎప్పుడూ గొడవలే. అందుకే ఆ సినిమా నాకు చాలా కష్టంగా అనిపించింది. ఈ సినిమా చేస్తున్నప్పుడు టాలీవుడ్‌ చిత్ర పరిశ్రమలో ఇదివరకు ఎప్పుడూ ఎవ్వరూ చేయని సినిమా నేను చేస్తున్నాను అనిపించింది. సినిమా తప్పకుండా ప్రేక్షకులకు నచ్చుతుంది అనిపించింది. అంచనాలకు తగ్గట్టే సినిమా భారీ విజయం సాధించింది. ఇప్పుడు ‘ఏ మంత్రంవేశావె’తో పాటు ‘ట్యాక్సీవాలా’ చిత్రంలోనూ నటిస్తున్నాను. ఇదో సూపర్‌ నేచురల్‌ థ్రిల్లర్‌. ఈ సినిమాతో నాలోని అర్జున్‌రెడ్డిని మర్చిపోతారు. ఇందులో నేను క్యాబ్‌ డ్రైవర్‌గా నటిస్తున్నాను.’ఇటీవల నేను ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నాను. అది కూడా మెగాస్టార్‌ చిరంజీవి చేతుల మీదుగా. ఇది మాత్రం మర్చిపోలేని విషయం.’ అని విజయ్‌ చెప్పుకొచ్చారు.

Show Full Article
Print Article
Next Story
More Stories