శ్రీదేవి మరణానికి కారణం.. తెలిసిపోయింది!

Submitted by arun on Mon, 03/05/2018 - 12:13
Sridevi

అతిలోక సుందరి శ్రీదేవి హఠాన్మరణానికి కారణం ఏంటి? కనిపించడానికి అత్యంత అందంగా.. అత్యంత ఆరోగ్యంగా ఉన్న శ్రీదేవి ఎలా చనిపోయింది? ఎందుకు చనిపోవాల్సి వచ్చింది? ఈ ప్రశ్నలకు ఇప్పుడిప్పుడే సమాధానాలు బయటికి వస్తున్నాయి. అందంపై అమితాసక్తి.. ఆహార్యంపై ఎడతెగని ప్రేమ.. ఈ రెండే శ్రీదేవి అకాల మరణానికి కారణమన్న మాట బలంగా వినిపిస్తోంది.

అందం కోసం శరీరాన్ని ముప్పుతిప్పలు పెట్టిన శ్రీదేవి.. సర్జరీలు కూడా చేయించుకుందన్న మాట.. అంతే కాక.. తిండి కూడా తగ్గించేసి రెగ్యులర్ గా డైట్ కంట్రోల్ చేసిందన్న మాట.. ఆమె సంబంధికులు తరచూ చెబుతున్నారు. దీంతో.. శరీరానికి తగిన కార్బోహైడ్రేట్లు.. విటమిన్లు అందకపోయి ఉండొచ్చని నిపుణులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఈ కారణంగానే.. శ్రీదేవి అలసటకు, అంతులేని అనారోగ్యానికి గురై ఉంటుందని.. అది అటు తిరిగి.. ఇటు తిరిగి.. చివరికి గుండెపోటుకు దారి తీసి ఉంటుందని అనుమానిస్తున్నారు. ఈ విషయాన్ని అందం కోసం ఆరాటపడే ప్రతి ఒక్కరూ ఓ గుణపాఠంగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇతాహారం.. మితాహారం అన్నారు కానీ.. అసలే తినకుండా ఆత్మారాముడిని అలిగేలా చేస్తే.. అసలుకే మోసం వస్తుందన్న వాస్తవాన్ని గ్రహించాల్సిన అవసరం కూడా ఉంది.

అందుకే.. మనల్ని అర్థంతరంగా విడిచిపెట్టిన శ్రీదేవి విషయాన్నే అందరం గుణపాఠంగా తీసుకోవాలి. అందం కోసం అమితంగా ఆరాటపడకుండా.. సహజ సౌందర్యాన్ని గౌరవించుకోవాలి.

English Title
mystery revealed Sridevi's death

MORE FROM AUTHOR

RELATED ARTICLES