శివుడిపై పిడుగు పడుతుంది...ఎక్కడో తెలుసా!!

Submitted by arun on Wed, 04/25/2018 - 15:18
 bijli mahadeva temple

సమస్త భూమండలంపైనే ఇది ఒక అద్భుతం. ఎక్కడా కనిపించిన అరుదైన దృశ్యం. ఆ అపురూప విన్యాసాన్ని... పుష్కరకాలం ఓ తపస్సులా భావిస్తారు భక్తజనం. భోళాశంకరుడి విరాట్‌ విశ్వరూపానికి తపించిపోతారు. మళ్లీ పన్నెండేళ్లు ఎలా గడుస్తాయా అంటూ ఎదురుచూస్తుంటారు. మంచుకొండల్లో మహాదేవుడి లీలా విన్యాసాలను తలుచుకుంటూ తన్మయత్వం చెందుతారు. ఇంతకీ ఆ అద్భుతం ఏంటి? మహదేవుడి లీలా మహత్యం ఏంటి?

మహాదేవుడి విరాట్‌ విశ్వరూపం..మంచుకొండల్లో మహా శివుడి విన్యాసం..పుష్కరకాలంలో ఒక్కసారే కనిపించే అపురూపం..మహాదేవుడి మందిరంపై మహా పిడుగు పడే సందర్భం..ఆ వికృత శబ్దానికి కొండలు కంపిస్తాయి... బండలు అదిరిపడతాయి..ప్రజలు భయకంపితులవుతారు.... పశు పక్ష్యాదాలు పారిపోతాయి..పిడుగు దెబ్బకు శివలింగం తునాతునకలైపోతుంది..అయినా మందిరం చెక్కుచెదరదు. బండరాళ్లు కిందపడవు..ఏంటీ ముక్కంటి మహిమ... ఏంటి నీలకంఠుడి లీల?

Image removed.

హిమాచల్‌ప్రదేశ్‌... దేవభూమి. దేవుళ్లు నడయాడే కర్మభూమి. చుట్టూ దట్టమైన పచ్చటి లోయలు, మంచు శిఖరాలు. అందమైన సరస్సులు, పచ్చని పచ్చిక మైదానాలు. ఒక్కమాటలో చెప్పాలంటే అదో భూలోక స్వర్గం. అలాంటి భువిపై కులులో కొలువుదీరిన మహాదేవుడి మందిరంలో పన్నెండేళ్లకోసారి ఈ అద్భుతం జరుగుతుంది. పుష్కరకాలంలో ఒకే ఒక్కసారి గుడిపై పిడుగు పడి శివలింగం ముక్కలుగా అవుతుంది. 

కొన్ని రహస్యాలు రహస్యాలుగానే ఉంటాయి..అంచనాకు అందవు.... అంతు చిక్కువు..బిజిలీ మహదేవ్‌ మందిర్‌ కూడా అలాంటిదే..పిడుగు పడటం... శివలింగం బద్ధలవడం..ఏంటీ అద్భుతం... శాస్త్రవేత్తలకు అందని రహస్యం

మంచుకొండల్లో మాములుగానే వర్షాలు పడుతుంటాయి. కానీ కులులో కొలువుదీరిన బిజిలీ మహదేవ్‌ మందిరంపై మాత్రం పన్నెండేళ్లకోసారి అద్భుతం జరుగుతుంది. అప్పటి దాకా సాధారణగా ఉన్న ఆకాశం అప్పటికప్పుడే మేఘావృతం అవుతుంది. ఉరుములు, మెరుపులతో ప్రళయ బీకరంగా మారుతుంది. అంతలోనే పెళపెళమంటూ శబ్ధం... అనూహ్యంగా పిడుగు పడటం... గురి చూసి కొట్టినట్టుగా ఆ పిడుగు మహాదేవుని మందిరాన్నే తాకుతుంది. అందులోని శివలింగాన్ని తునాతునకలు చేస్తుంది. 

ఆ వికృతశబ్దానికి అక్కడి కొండలు కంపించిపోతాయి. చుట్టుపక్కల ప్రజలు వణికిపోతారు. పశుపక్ష్యాదులు ప్రాణభయంతో పారిపోతాయి. పిడుగు దెబ్బకు శివలింగం తునాతునకలైపోతుంది. కాని మందిరం చెక్కుచెదరదు. కొండపై వున్న బండరాళ్లూ కూడా కిందపడదు. ఇది ఆ మహాదేవుడి మహిమా? శివలీలా మహత్యమా? 

ఒకటి కాదు.. రెండు కాదు... వందల ఏళ్ల నుంచీ ఇదే జరుగుతోంది. ఇలా ఎందుకు జరుగుతుందో తెలియట్లేదు. శాస్త్రవేత్తల అంచనాకూ అందట్లేదు. కానీ ప్రతీ పన్నెండేళ్లోసారి ఆగట్లేదు. తెల్లారే సరికి అంతా నార్మల్‌గా కనిపిస్తుంది. ఏమీ జరగనట్లే అగుపిస్తుంది. ఇది వింతా? శివలీలా?

వందల ఏళ్ల నుంచీ ఇదే జరుగుతుంది.. పన్నెండేళ్లకోసారి సాక్షాత్కరిస్తుంది..పిడుగు పడే రాత్రి అద్భుతం అగుపిస్తుంది..తెల్లారే సరికి అంతా మాములైపోతుంది

పిడుగు పడే రాత్రి బిజిలీ మహాదేవ్‌ మందిరం చుట్టు పక్కల ప్రాంతాల్లో అద్భుతం చోటుచేసుకుంటుంది. కచ్చితంగా పిడుగు పడి మహాలింగాన్ని తునాతునకలు చేస్తుందన్న సంకేతాలు ఇస్తుంది. అంతలోనే ఆకాశం మబ్బు పడుతుంది. జోరు వాన కురుస్తుంది. ఉరుములు, మెరుపులతో చెవులు దద్దరిల్లే శబ్ధాలతో బిజిలీ మహదేవ్‌ మందిరం చుట్టూ చీకటి కమ్ముకుంటుంది. అంతలోనే పిడుగు పడుతుంది. 

పిడుగుపాటుకు శివలింగం తునాతునకలైపోతుంది. తెల్లారి ఆ గుడికి వెళ్ళిన పూజారి ముక్కలను ఒక్కొక్కటీచేర్చి అభిషేకం చేస్తారు. అంతకుముందు ఎలా వుండేదో అలాగే మారిపోతుంది. అక్కడ ఏమీ జరగనట్లు కనిపిస్తుంది. దీన్ని వింత అనాలో, శివుని లీల అనాలో అర్థంకాని పరిస్థితి భక్తులది. ఇలా ఒకటిరెండు సార్లు కాదు వందలు ఏళ్లనుంచి వస్తుంది. ప్రతి 12ఏళ్లకొకసారి జరిగే అద్భుతమిది. శివుడి ఆజ్ఞ ప్రకారమే 12ఏళ్లకోసారి పిడుగు పడుతుందని ఆ వెంటనే ఆ శివలింగం అతుక్కుంటుందనేది ప్రతీతి. పిడుగుపడట అతుక్కోవటం మన దేశంలోనే అత్యంత అద్భుతంగా చెబుతారు ఇక్కడి స్థానికులు.

English Title
mystery of bijli mahadeva temple shivilinga story and facts himanchal pradesh

MORE FROM AUTHOR

RELATED ARTICLES