చీపురుపల్లిలో ఎగిరేది ఎవరి జెండా...జనసేన చీల్చే ఓట్లు ఎవరికి వరం..ఎవరికి శాపం?

చీపురుపల్లిలో ఎగిరేది ఎవరి జెండా...జనసేన చీల్చే ఓట్లు ఎవరికి వరం..ఎవరికి శాపం?
x
Highlights

విజయనగరం జిల్లా చీపురుపల్లి. ఏదో మూలన ఉండే నియోజకవర్గం అనుకోవద్దండి. అక్కడ రాజకీయాలు, సెంటర్‌లో హీటెక్కిస్తాయి. స్టేట్‌ హాట్‌ సీట్‌లో కాక...

విజయనగరం జిల్లా చీపురుపల్లి. ఏదో మూలన ఉండే నియోజకవర్గం అనుకోవద్దండి. అక్కడ రాజకీయాలు, సెంటర్‌లో హీటెక్కిస్తాయి. స్టేట్‌ హాట్‌ సీట్‌లో కాక పుట్టిస్తాయి. ఇప్పుడు కూడా చీపురుపల్లిలో పాలిటిక్స్ యమ రంజుమీద సాగుతున్నాయి. హోరాహోరిగా సాగిన చీపురుపల్లిలో విజేత ఎవరు? జనం పట్టాభిషేకం ఎవరికి?

విజయనగరం జిల్లా చీపురుపల్లి అసెంబ్లీ పరిధిలో 1,98,832 మంది ఓటర్లు ఉండగా, అందులో 1,65,174 మంది మాత్రమే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. నియోజకవర్గంలో 81,124 మంది మహిళలు ఓటు వేశారు. 83,149 మంది పురుషులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మొత్తంగా నియోజకవర్గంలో 83 శాతం ఓటింగ్ నమోదైంది.

చీపురుపల్లిలో హోరాహోరి పోరు సాగింది. ఎందుకంటే, ఇక్కడ తలపడుతున్నది మామూలు వ్యక్తులు కాదు. టీడీపీ అభ్యర్దిగా సిట్టింగ్ ఎంఎల్ఎ కిమిడి మృణాళిని కుమారుడు నాగార్జున బరిలో నిలవగా, వైసీపీ నుంచి మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ పోటీలో ఉన్నారు. వీరితోపాటు నియోజకవర్గంలో జనసేన, బీజేపీ, కాంగ్రెస్‌ల నుంచి అభ్యర్దులు ఎన్నికల బరిలో నిలిచారు. సీనియర్ వర్సెస్ జూనియర్‌గా ఎన్నికలు రసవత్తరంగా సాగాయి.

చీపురుపల్లి నియోజకవర్గంలో ఏ పార్టీ నాయకుడు గెలుపొందితే రాష్ట్రంలో అదేపార్టీ రూలింగ్ చేస్తూ ఇంతవరకు వచ్చింది. మరి ఇంతటి ఘన చరిత్ర కలిగిన చీపురుపల్లిలో, ఈసారి ఏపార్టీ జెండా ఎగురుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది. దీంతో అటు నాయకుల్లోనూ ఇటు నియోజకవర్గం ప్రజల్లోనూ ఎప్పుడెప్పుడు ఫలితాలు వస్తాయో, తమ అభిమాన నేత గెలుపొందుతాడో లేదోనని ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇక పోటిలో నిలిచిన అభ్యర్తులైతే నియోజకవర్గంలో జరిగిన పోలింగ్ శాతాలను లెక్కలు కడుతూ గెలుపుపై దీమా వ్యక్తం చేస్తున్నారు. ఎవరికి వారే తమ గెలుపు ఖాయమంటూ మెజారిటీలను లెక్కిస్తున్నారు. అయితే, రైతుకు పెట్టుబడి, పసుపు కుంకుమ, పెన్షన్లే తమను గెలిపిస్తాయని టీడీపీ అభ్యర్థి నాగార్జున చెబుతుంటే, జగన్‌పై అభిమానానికి తోడు, తన దశాబ్దాల రాజకీయం, వ్యక్తిగత చరిష్మా కూడా కలిసి వస్తుందని బొత్స ఆత్మవిశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. చూడాలి, చీపురుపల్లిలో ఎవరి అంచనా నిజమవుతుందో.


Show Full Article
Print Article
Next Story
More Stories