ఫలితాలపై స్పందించిన కేటీఆర్‌

ఫలితాలపై స్పందించిన కేటీఆర్‌
x
Highlights

తెలంగాణలో క్లీన్ స్వీప్ చేస్తుందనుకున్న కారు స్పీడుకు బ్రేకులు పడ్డాయి. ఆశించిన ఫలితాలు సాధించకపోగా గతం కంటే రెండు స్థానాలు తగ్గాయి. 2014లో 11 సీట్లు...

తెలంగాణలో క్లీన్ స్వీప్ చేస్తుందనుకున్న కారు స్పీడుకు బ్రేకులు పడ్డాయి. ఆశించిన ఫలితాలు సాధించకపోగా గతం కంటే రెండు స్థానాలు తగ్గాయి. 2014లో 11 సీట్లు గెలిచిన టీఆర్ఎస్ ఈసారి 9 స్థానాలకే పరిమితమైంది. ఈ విజయ పరాజయంపై కేటీఆర్‌ స్పందించారు. ఆశించిన స్థానాలు రాలేదని, ప్రజాస్వామ్యంలో గెలుపోటములు సహజమని, ఏం జరిగిందన్న దానిపై విశ్లేషించుకుంటామని తెలిపారు. 16 స్థానాలు రావాలని కోరుకున్నామని, కానీ 9 స్థానాలు గెలిపించిన ప్రజల తీర్పు శిరోధార్యమన్నారు. ఈ సందర్భంగా గెలిచిన బీజేపీ, కాంగ్రెస్‌ మిత్రులకు ధన్యవాదాలు తెలిపారు కేటీఆర్‌. ప్రధానిగా బాధ్యతలు చేపట్టబోతున్న మోడీకి, ఏపీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్న జగన్‌కు అభినందనలు తెలిపారు కేటీఆర్‌.

Show Full Article
Print Article
Next Story
More Stories