రాగి లడ్డు తయారీ ఎలా..?

రాగి లడ్డు తయారీ ఎలా..?
x
Highlights

కావలసిన పదార్ధాలు : మొలకెత్తిన రాగుల పిండి – ఒక కప్పు బెల్లం పొడి – అర కప్పు నెయ్యి – రెండు టేబుల్‌ స్పూన్లు ఎండు కొబ్బరి ముక్కలు– పావు కప్పు ...

కావలసిన పదార్ధాలు :

మొలకెత్తిన రాగుల పిండి – ఒక కప్పు

బెల్లం పొడి – అర కప్పు

నెయ్యి – రెండు టేబుల్‌ స్పూన్లు

ఎండు కొబ్బరి ముక్కలు– పావు కప్పు

ఏలకుల పొడి – పావు టీ స్పూను

మరిగించిన పాలు – పావు కప్పు

జీడి పప్పులు – 10

బాదం పప్పులు – 10

ఎండు కొబ్బరి తురుము

తయారీ విధానం:

ఒక గిన్నెలో నెయ్యి వేసి బాగా కాగనివ్వాలి. ఆ తరవాత జీడి పప్పు పలుకులు, బాదం పలుకులు వేయాలి. జీడిపప్పు, బాదం పప్పు బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించాలి. రంగు వచ్చిన తరువాత రాగి పిండి ఇందులో వేసుకోవాలి..ఇప్పుడు మరోసారి దోరగా వేయించాలి. తరువాత బెల్లం పొడి, ఎండు కొబ్బరి తురుము, ఏలకుల పొడి వేయాలి..కాస్త వేయించాలి. ఇప్పుడు ఈ మిశ్రమంలో వేడి పాలు పోసి కలియబెట్టాలి. మంట తగ్గించి, గిన్నె మీద మూత పెట్టాలి. రెండు మూడు నిమిషాలు అలాగే ఉండనివ్వాలి. తరువాత గిన్నె దింపేయాలి. ఎండు కొబ్బరి ముక్కలు జత చేస్తూ, కావలసిన సైజుల్లో లడ్డూలు తయారుచేసుకోవాలి. రాగి లడ్డు రెడీ.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories