వివాహేతర సంబంధమే కారణమా?

Submitted by arun on Sat, 08/25/2018 - 13:22
murder

కృష్ణా జిల్లా హనుమాన్‌ జంక్షన్‌లో దారుణం  జరిగింది.  బాపులపాడులో  పద్మ అనే మహిళపై గుర్తు తెలియని వ్యక్తులు అమానుషంగా దాడి చేసి హత్యాయత్నం చేశారు.  నిన్న అర్ధరాత్రి ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు కాళ్లు, చేతులు కట్టేసి దారుణంగా హింసించారు. మోచేతి భాగంలో నరకడంతో భారీగా రక్తస్రావం జరిగింది. గొంతుకు ప్లాస్టిక్ కవర్లు చుట్టి చంపేందుకు యత్నించారు. కొన ఊపిరితో ఉన్న  పద్మను గుర్తించిన స్ధానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. బాధితురాలి విజయవాడ ఆసుపత్రికి తరలించిన పోలీసులు చికిత్సనందిస్తున్నారు .

బ్యూటీషియన్‌గా పనిచేస్తున్న పద్మ గత కొద్దికాలంగా భర్తకు దూరంగా ఉంటూ ఒంటరిగా జీవిస్తోంది. అయితే ఈ క్రమంలో కొంత కాలం క్రితం  నూతన్‌ కమార్‌ అనే వ్యక్తితో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. వీరిద్దరు గత కొద్దికాలంగా  సహజీవనం చేస్తున్నారు. అయితే ఇటీవల విభేదాలు  రావడంతో దూరంగా ఉంటూ వస్తున్నారు. ఈ నేపధ్యంలోనే దాడి జరిగినట్టు పోలీసులు భావిస్తున్నారు. దాడికి పాల్పడిన నూతన్ కుమార్‌ విజయవాడలోని ఓ ప్రైవేటు బ్యాంకులో ఉద్యోగిగా పనిచేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.  బాధితురాలు  కోలుకున్న తరువాత విచారిస్తే మరిన్ని విషయాలు తెలుస్తాయని చెబుతున్నారు.  

Tags
English Title
murder attempt beautician padma

MORE FROM AUTHOR

RELATED ARTICLES