నీటి కోసం కాదు.. చేపల కోసమే ఇదంతా!

నీటి కోసం కాదు.. చేపల కోసమే ఇదంతా!
x
Highlights

చెరువు చేప అంటే ఇష్టం లేనిదెవరికి చెప్పండి. ఇక చేపలు కొనక్కర్లేకుండా ఫ్రీ గా వస్తున్నాయంటే.. అసలు చెప్పక్కర్లేదు. కూరొండుకుందామా.. పులుసు చేసుకుందామా...

చెరువు చేప అంటే ఇష్టం లేనిదెవరికి చెప్పండి. ఇక చేపలు కొనక్కర్లేకుండా ఫ్రీ గా వస్తున్నాయంటే.. అసలు చెప్పక్కర్లేదు. కూరొండుకుందామా.. పులుసు చేసుకుందామా అనుకుంటూ పరుగులు తీస్తారు. ఇదిగో ఇది అలాంటి సంఘటనే! వేసవి కాలం కావడంతో చెరువులు ఎండి పోతున్నాయి. దీంతో చెరువులో చేపలు యిట్టె చేతికి చిక్కేస్తున్నాయి. కురవి మండలం నేరడ గ్రామశివారులో ఉన్నపెద్ద చెరువులో నీరు అడుగంటిపోవడంతో గురువారం ఉదయం ప్రజలు చేపల వేటకు దిగారు. నేరడ గ్రామంతో పాటు, ఇతర మండలాల్లోని వివిధ గ్రామాలకు చెందిన ప్రజలు పెద్ద ఎత్తున చెరువు వద్దకు చేరుకున్నారు. వలలతో చెరువులోని గుంతల్లో ఉన్న నీటిలోకి దిగారు. మగవారితో పాటు మహిళలు సైతం వలలు, చీరలు చేతపట్టి చేపల వేటకు దిగారు. వలలు, చీరలకు చిక్కిన చేపలను పట్టుకున్నారు. చెరువులో పెద్ద ఎత్తున చేపల వేటకు దిగిన వారితో చెరువులోఎటు చూసినా జనసందోహం నెలకొంది. చెరువు కట్టపై నుంచి వెళ్లే వారు చేపల కోసం వచ్చిన వారిని చూసి ఆశ్చర్యపోయారు. తీరుబడిగా వెళ్లొచ్చనుకున్న వారు తాము కూడా చెరువులోకి దిగి చేపల వేట మొదలెట్టారు. ఉచితం అనే మాటకు ఎంత విలువుందో చూశారా?

Show Full Article
Print Article
Next Story
More Stories