ఉద్యమాలు నడిపే శక్తి పవన్ కళ్యాణ్‌కు లేదు : ముద్రగడ

Submitted by arun on Sat, 02/10/2018 - 15:44
mudragada padmanabham

ప్రత్యేక హోదా కోసం ఏపీకి చెందిన కేంద్ర మంత్రులు రాజీనామాలు చేసి వస్తే వారి వెనుక నడవడానికి సిద్దంగా ఉన్నామన్నారు కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం. తిరుపతిలో కాపు ఆత్మీయ కలయిక కార్యక్రమంలో పాల్గొన్న ముద్రగడ కేంద్రం మెడలు వంచాలంటే చంద్రబాబు ఉద్యమాన్ని ముందుండి నడిపించాలని సూచించారు. అటు ఉద్యమాలు నడిపే శక్తి పవన్ కళ్యాణ్‌కు లేదన్నారు. మార్చి నెలాఖరులోగా కాపులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే తమ తడాఖా చూపిస్తామన్నారు ముద్రగడ.


 

English Title
mudragada warning cm chandrababu naidu over kapu reservations

MORE FROM AUTHOR

RELATED ARTICLES