ధోనీ ఆ బాల్ ఎందుకు తీసుకున్నాడు...రిటైర్‌ కాబోతున్నాడా..?

ధోనీ ఆ బాల్ ఎందుకు తీసుకున్నాడు...రిటైర్‌ కాబోతున్నాడా..?
x
Highlights

ఇంగ్లండ్ తో వన్డే సిరీస్ ను టీమిండియా కోల్పోయిన సంగతి తెలిసిందే. మ్యాచ్ ముగిసిన వెంటనే జరిగిన ఒక ఘటన క్రికెట్ అభిమానులను కలవరపెడుతోంది. మ్యాచ్ ను...

ఇంగ్లండ్ తో వన్డే సిరీస్ ను టీమిండియా కోల్పోయిన సంగతి తెలిసిందే. మ్యాచ్ ముగిసిన వెంటనే జరిగిన ఒక ఘటన క్రికెట్ అభిమానులను కలవరపెడుతోంది. మ్యాచ్ ను భారత్ కోల్పోయిన అనంతరం... అంపైర్ల వద్దకు వచ్చిని ధోనీ, వారి వద్ద నుంచి బాల్ ను తీసుకుని, పెవిలియన్ కు వెళ్లిపోయాడు. సాధార‌ణంగా ఏదైనా ఒక మ్యాచ్‌లో గుర్తుండిపోయే ప్ర‌ద‌ర్శ‌న చేసిన‌పుడు లేదా విజ‌యం సాధించిన‌పుడు ఆట‌గాళ్లు ఆ మ్యాచ్‌కు సంబంధించిన గుర్తుగా బాల్, వికెట్ లేదా బెయిల్స్ వంటి వాటిని తీసుకుంటుంటారు. అయితే ఇటువంటి ఏ కార‌ణం లేకుండా మంగ‌ళ‌వారం ఇంగ్లండ్‌తో జ‌రిగిన వ‌న్డే అనంత‌రం అంపైర్ల నుంచి మ్యాచ్ బాల్‌ను ఎంఎస్ ధోని అడిగి తీసుకోవ‌డం సంచ‌ల‌నంగా మారింది.

ఎందుకంటే ఈ మ్యాచ్‌లో భార‌త్ ఘోర ప‌రాజ‌యం పాలై సిరీస్‌ను చేజార్చుకుంది. ధోని కూడా మెరుగైన ప్ర‌ద‌ర్శ‌న చేయ‌లేదు. మ‌రి, మ్యాచ్ బాల్‌ను ధోని ఎందుకు తీసుకున్నాడ‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది. త‌న చివ‌రి టెస్ట్ మ్యాచ్ ఆడిన త‌ర్వాత‌ ధోని వికెట్ల‌పై ఉండే బెయిల్స్‌ను తీసుకున్నాడు. మరిప్పుడు వేరే ఏ కార‌ణం లేకుండా మ్యాచ్ బాల్‌ను తీసుకోవ‌డంతో ధోని రిటైర్మెంట్ గురించి ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న ఇంగ్లండ్ ప‌ర్య‌ట‌న‌లో ధోని వ‌రుస వైఫ‌ల్యాల‌ను ఎదుర్కొంటున్న సంగ‌తి తెలిసిందే. దీంతో దోనిపై విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. ఆ కార‌ణంగానే ఇక అంత‌ర్జాతీయ క్రికెట్‌కు ధోని వీడ్కోలు చెప్పాల‌నుకుంటున్నాడేమో అని నెటిజ‌న్లు ట్వీట్లు చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories