ఏపీ పోలీసులకు వీక్లీ ఆఫ్..జీవో జారీ చేసిన ఏపీ ప్రభుత్వం

ఏపీ పోలీసులకు వీక్లీ ఆఫ్..జీవో జారీ చేసిన ఏపీ ప్రభుత్వం
x
Highlights

ఏపీ సీఎం జగన్ ఎన్నికల ముందు ఇచ్చిన ఒక్కొక్క హామీని నెరవేరుస్తూ వస్తున్నారు. పోలీసులకు వీక్లీ ఆప్ ను ప్రకటించారు. దీంతో కానిస్టేబుల్ నుంచి సీఐ దాకా...

ఏపీ సీఎం జగన్ ఎన్నికల ముందు ఇచ్చిన ఒక్కొక్క హామీని నెరవేరుస్తూ వస్తున్నారు. పోలీసులకు వీక్లీ ఆప్ ను ప్రకటించారు. దీంతో కానిస్టేబుల్ నుంచి సీఐ దాకా వారానికో రోజు సెలవు లభిస్తుంది. పోలీసుల వీక్లీ ఆఫ్‌ను రేపటి నుంచే అమలు చేయాలంటూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఏపీ కేబినేట్ తొలి మీటింగ్ లో పోలీసులకు వీక్లీ ఆఫ్ ఇవ్వడంపై సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. వారంతపు సెలవు ఇవ్వడంలో సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేసేందుకు కమిటీని ఏర్పాటు చేశారు.

ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ పోలీసు శాఖలో 30 విభాగాలను అధ్యయనం చేసి 19 మోడళ్లను రూపొందించింది. యూనిట్‌ అధికారులు ఏదో ఒక నమూనాను ఎంపిక చేసుకోవచ్చు. ఇప్పటికే విశాఖ, కడప జిల్లాలలో ప్రయోగాత్మకంగా పోలీసులకు వీక్లీ ఆఫ్‌ అమలవుతుంది. వీక్లీ ఆఫ్ లో గల ఇబ్బందులను హోంశాఖ పరిష‌్కరిస్తు వస్తుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం పోలీసులకు వీక్లీ ఆఫ్ ప్రకటించింది. ఏపీయస్పీ, ఆర్మ్‌డ్ రిజర్వ్ పోలీసులకు కూడా వీక్లీ ఆఫ్ వర్తిస్తుంది. కానిస్టేబుల్ నుంచి సీఐ దాకా వారానికో రోజు సెలవు లభిస్తుంది. బుధవారం నుంచే వీక్లీ ఆఫ్ అమలు చేయాలని ప్రభుత్వం జీవో జారీ చేసింది.

పోలీసు వ్యవస్థలో వారాంతపు సెలవు ఓ సంచలన నిర్ణయంగా పోలీసు సంఘాలు అభివర్ణిస్తున్నాయి. వీక్లీ ఆఫ్‌ల వల్ల పోలీసులకు ఒత్తిడి తగ్గే అవకాశం ఉందంటున్నారు ఆ సంఘాల నాయకులు వీక్లీ ఆఫ్ పై మాట నిలబెట్టుకున్న సీఎం జగన్ పై పోలీసులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories