మహేంద్ర సింగ్ ధోనీకి రవిశాస్త్రి హ్యాట్సాఫ్

Submitted by arun on Mon, 12/25/2017 - 18:13
MSDRavi Shastri

టీమిండియా ఎవర్ గ్రీన్ వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ మహేంద్ర సింగ్ ధోనీపైన చీఫ్ కోచ్ రవి శాస్త్రి ప్రశంసల వర్షం కురిపించాడు. 2019 ప్రపంచకప్ వరకూ ధోనీ భారత వన్డే, టీ-20 జట్లలో కొనసాగుతాడని చెప్పకనే చెప్పాడు. ప్రస్తుత భారత క్రికెటర్లలో 26 ఏళ్ల వయసున్న నవతరం క్రికెటర్లలో చాలామంది కంటే 36 ఏళ్ల ధోనీ చాలా చురుకుగా, ఫిట్ గా ఉన్నాడని ప్రశంసించాడు. ప్రస్తుత భారత క్రికెట్లో మాత్రమే కాదు ప్రపంచ క్రికెట్లోని అత్యుత్తమ క్రికెటర్లో ధోనీ ఒకడని అందరూ గమనించాలని భారత ప్రధాన శిక్షకుడు రవి శాస్త్రి కోరాడు. మరోవైపు బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ ఎమ్మేస్కే ప్రసాద్ సైతం మహేంద్ర సింగ్ ధోనీ ఫిట్ నెస్, వికెట్ కీపింగ్ ప్రతిభకు హ్యాట్సాఫ్ చెప్పాడు. శ్రీలంకతో ముగిసిన తీన్మార్ వన్డే, టీ-20 సిరీస్ ల్లో ధోనీ వికెట్ కీపింగ్ ప్రమాణాలు అత్యున్నత స్థాయిలో ఉండడంతో విమర్శకులు సైతం వారేవ్వా! అనక తప్పలేదు.

English Title
MS Dhoni at 36 can beat players of 26: Ravi Shastri

MORE FROM AUTHOR

RELATED ARTICLES