ఇండియన్ క్రికెట్ ఎవర్ గ్రీన్ ధోనీ.. 2019 ప్రపంచకప్ వరకూ మహీనే కీపర్

ఇండియన్ క్రికెట్ ఎవర్ గ్రీన్ ధోనీ.. 2019 ప్రపంచకప్ వరకూ మహీనే కీపర్
x
Highlights

టీమిండియా ఎవర్ గ్రీన్ వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ మహేంద్ర సింగ్ ధోనీపైన చీఫ్ కోచ్ రవి శాస్త్రి, చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ ప్రశంసల వర్షం...

టీమిండియా ఎవర్ గ్రీన్ వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ మహేంద్ర సింగ్ ధోనీపైన చీఫ్ కోచ్ రవి శాస్త్రి, చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ప్రపంచ క్రికెట్లోనే ధోనీ అత్యుత్తమ వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ అంటూ ఆకాశానికి ఎత్తేశారు. 2019 ప్రపంచకప్ వరకూ ధోనీ భారత వన్డే, టీ-20 జట్లలో కొనసాగుతాడని చెప్పకనే చెప్పారు. భారత ఎవర్ గ్రీన్ వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ కమ్ జార్ఖండ్ డైనమైట్ మహేంద్ర సింగ్ ధోనీ పై HMTV స్పెషల్ స్టోరీ.

భారత క్రికెట్ ఆల్ టైమ్ గ్రేట్ వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ మహేంద్రసింగ్ ధోనీ తన కెరియర్ ను 2019 ప్రపంచకప్ వరకూ కొనసాగించే విషయమై ముసురుకొన్న మేఘాలు ఒక్క దెబ్బతో తేలిపోయాయి. ధోనీని తప్పించి యువఆటగాళ్లకు అవకాశం కల్పించాలంటూ ఇటీవలి కాలంలో వచ్చిన విమర్శలకు శ్రీలంకతో ముగిసిన తీన్మార్ వన్డే, టీ-20 సిరీస్ ల ద్వారా తెరపడింది. ప్రస్తుత భారత క్రికెటర్లలో 26 ఏళ్ల వయసున్న నవతరం క్రికెటర్లలో చాలామంది కంటే 36 ఏళ్ల ధోనీ చాలా చురుకుగా, ఫిట్ గా ఉన్నాడంటూ టీమిండియా చీఫ్ కోచ్ రవి శాస్త్రి ఓవైపు ప్రశంసల వర్షం కురిపిస్తుంటే మరోవైపు చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ మరో అడుగు ముందుకు వేసి ప్రస్తుత ప్రపంచ క్రికెట్లో ధోనీని మించిన అత్యుత్తమ వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ లేడంటూ కొనియాడారు. 2019 ప్రపంచకప్ వరకూ ధోనీనే వన్డే, టీ-20 ఫార్మాట్లలో భారత్ కు సేవలు అందిస్తాడని చెప్పారు.

కూల్ కూల్ కెప్టెన్ గా, లైట్నింగ్ వికెట్ కీపర్ గా డాషింగ్ బ్యాట్స్ మన్ గా గొప్ప మ్యాచ్ ఫినిషర్ గా గత దశాబ్దకాలంగా భారత క్రికెట్ కు ఎనలేని సేవలు అందించిన ధోనీ ప్రస్తుతం టీమిండియాకు పెద్దదిక్కుగా కెప్టెన్ విరాట్ కొహ్లీకి కొండంత అండగా నిలిచాడు. టీమిండియా ను టెస్ట్ క్రికెట్లో ప్రపంచ నంబర్ వన్ జట్టుగా నిలపడంలోనూ వన్డే, టీ-20, మినీ ప్రపంచకప్ టోర్నీల్లో విజేతగా నిలపడంలో సారథిగా ధోనీ నిర్వహించిన పాత్ర అంతాఇంతా కాదు. 2004లో స్టీల్ సిటీ విశాఖ వేదికగా చిరకాల ప్రత్యర్థి పాక్ తో జరిగిన మ్యాచ్ ద్వారా వన్డే అరంగేట్రం చేసిన ధోనీ ఆ తర్వాత మరి వెనుదిరిగి చూసింది లేదు. శ్రీలంకతో ముగిసిన 2017 సిరీస్ వరకూ 13 ఏళ్ల కెరియర్ లో 312 వన్డేలు ఆడిన ధోనీ మొత్తం 10 సెంచరీలు, 67 హాఫ్ సెంచరీలతో 9898 పరుగులు సాధించాడు. వన్డేల్లో 10వేల పరుగుల మైలు రాయికి 102 పరుగుల దూరంలో నిలిచాడు.

ఇక 2006లో సఫారీ గడ్డపై సౌతాఫ్రికాతో మ్యాచ్ ద్వారా టీ-20 అరంగేట్రం చేసిన ధోనీ ముంబైలో శ్రీలంకతో ముగిసిన మ్యాచ్ వరకూ 86 మ్యాచ్ లు ఆడి ఒకే ఒక్క హాఫ్ సెంచరీతో 1364 పరుగులు సాధించాడు. వికెట్ కీపర్ గా ఇప్పటికే 398మందిని క్యాచ్ లు, స్టంపౌట్ల ద్వారా పెవీలియన్ దారి పట్టించిన ధోనీ సౌతాఫ్రికా వికెట్ కీపర్ మార్క్ బౌచర్ తర్వాతి స్థానంలో కొనసాగుతున్నాడు. 2019 ప్రపంచకప్ టోర్నీ వరకూ భారత జట్టు సభ్యుడిగా కొనసాగనున్న ధోనీ వికెట్ కీపర్ గా సరికొత్త ప్రపంచ రికార్డులు నమోదు చేయగలడనడంలో ఏమాత్రం సందేహం లేదు. 36 ఏళ్ల వయసులో 26 ఏళ్ల కుర్రాడిలా దూసుకుపోతున్న ధోనీకి హ్యాట్సాఫ్ చెప్పక తప్పదు.

Show Full Article
Print Article
Next Story
More Stories