కీలక నిర్ణయం తీసుకున్న ఎంపీ విజయసాయిరెడ్డి

Submitted by nanireddy on Wed, 05/02/2018 - 08:49
vijayasaireddy

ఇప్పటికే అధినేత పాదయాత్రతో రాష్ట్రాన్ని చుట్టేస్తున్నారు. కడప జిల్లా మొదలు రాయలసీమను చుట్టేసి కోస్తాలోకి అడుగుపెట్టిన జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ఊళ్లు, సరిహద్దులు దాటుకుంటూ కృష్ణా జిల్లాలోకి ప్రవేశించింది. ప్రతి నియోజకవర్గంలో పాదయాత్ర జనసమీకరణతో జోరుగానే సాగుతోంది. ఆయనకు మద్దతగా కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల కోఆర్డినేటర్లు, ఎమ్మెల్యేలు పాదయాత్రలు ప్రారంభించి జనాల్లోకి వెళుతున్నారు. కేవలం వీరే కాకుండా వైసీపీ అగ్రనేత, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ విజయసాయిరెడ్డి కూడా పాదయాత్ర చేయాలనీ నిర్ణయం తీయూసుకున్నారు. అందులో భాగంగా విశాఖకు రైల్వే జోన్ సాధన పేరుతో విశాఖ జిల్లాలో పాదయాత్రకు శ్రీకారం చుట్టారు.దాదాపు పదకొండు రోజుల పాటు వివిధ నియోజకవర్గాల్లో విజయసాయిరెడ్డి పాదయాత్ర చేయనున్నారు. ఈ మేరకు ఆ పార్టీ ప్రకటన విడుదల చేసింది. కాగా వైసీపీ  విశాఖలో ఇప్పటికే నయవంచన పేరుతో ఒకరోజు దీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే.    

English Title
mp vijayasaireddy taken key decision

MORE FROM AUTHOR

RELATED ARTICLES