చంద్రబాబుపై విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

Submitted by arun on Thu, 07/19/2018 - 15:44
tdpycp

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఫోర్త్ జెండర్ అని...ఆడ, మగ, నపుంసక కాని మరో జీవి అని వ్యాఖ్యానించారు. ఫోర్త్ జెండర్ అంటే ప్రకృతి కార్యంలో కూడా డ్యుయల్ రోల్ ప్లే చేసే వ్యక్తి అని, చంద్రబాబు ఏపీకి సీఎంగా ఉంటూ ఫోర్త్ జెండర్‌గా ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. కాలానికి తగ్గట్లుగా చంద్రబాబు రంగులు మార్చుతారని ఎంపీ విమర్శించారు. చంద్రబాబు ఓవైపు బీజేపీతో రహస్య ఒప్పందం కొనసాగిస్తూనే.. మరోవైపు అవిశ్వాస తీర్మానాన్ని పెడుతున్నారని మండిపడ్డారు. వైఎస్సార్‌ సీపీ అవిశ్వాసం పెట్టినప్పుడు దానివల్ల ఏం ప్రయోజనమని ప్రశ్నించిన చంద్రబాబు.. ఇప్పుడు యూటర్న్ తీసుకుని అదే పని చేస్తున్నారని విరుచుకుపడ్డారు. వైఎస్సార్‌ సీపీ ఏపీకి ప్రత్యేక హోదా కోరుకుంటోందని, ఏపీకి న్యాయం జరిగేందుకు ఏ పార్టీ అవిశ్వాస తీర్మానం పెట్టినా మద్దతు ఇస్తామని గతంలోనే చెప్పామని గుర్తుచేశారు.

English Title
mp vijayasai reddy sensational comments cm chandrababu

MORE FROM AUTHOR

RELATED ARTICLES