నిరూపిస్తే రాజకీయ సన్యాసం: కవిత

Submitted by arun on Thu, 08/30/2018 - 17:34
kavitha

టీఆర్ఎస్ సర్కార్ అధికారంలోకి వచ్చాక ప్రతి నియోజకవర్గంలో 2వేల కోట్ల రూపాయల నిధులు కేటాయించామని ఎంపీ కవిత అన్నారు. రెండువేల కోట్ల కన్నా తక్కువ నిధులు కేటాయించినట్లు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని ఆమె తెలిపారు. లేకపోతే కాంగ్రెస్ పార్టీ నేతలు రాజకీయ సన్యాసం తీసుకుంటారా అంటూ ఛాలెంజ్ చేశారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా తాము సిద్ధమేనని కవిత అన్నారు.  కేసీఆర్‌ ఏం చేసినా ప్రతిపక్షాలకు భయమే..వాళ్ల ఆలోచన ప్రజలు కాదు పవర్‌ అని అన్నారు. కొంగర కలాన్‌ సభకు ఆర్టీసీ బస్సులను అద్దెకు మాత్రమే తీసుకుంటున్నామని, ఉద్దరకు తీసుకోవడంలేదని అన్నారు. దీనిపై కూడా విపక్షాలు కోర్టుకు వెళ్తే వారికే మొట్టికాయలు పడతాయని చెప్పారు. ఇక జోనల్ వ్యవస్థకు కేంద్రం ఆమోదం తెలపడం సంతోషకరమన్నారు. 

Tags
English Title
mp kavitha fire on congress leaders

MORE FROM AUTHOR

RELATED ARTICLES