logo

గల్లా జయదేవ్ వ్యాఖ్యలను ఖండించిన జితేందర్ రెడ్డి

గల్లా జయదేవ్ వ్యాఖ్యలను ఖండించిన జితేందర్ రెడ్డి

ఆంధ్రప్రదేశ్ ని అడ్డగోలుగా విభజించారంటూ లోక్ సభలో అవిశ్వాసంపై చర్చ సందర్భంగా టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ చేసిన వ్యాఖ్యలను టీఆర్ఎస్ ఖండించింది. ఆ పార్టీ ఎంపీ జితేందర్ రెడ్డి గల్లా జయదేవ్‌పై మండిపడ్డారు. రాజ్యాంగ విరుద్ధంగా, అశాస్త్రీయంగా రాష్ట్ర విభజన జరిగిందని చేసిన వ్యాఖ్యలను ఖండించారు. లోక్ సభ, రాజ్యసభలలో రాష్ట్ర విభజన బిల్లు ఆమోదం పొందిందని గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్రం కోసం ఎంతో మంది ఆత్మాబలిదానాలకు పాల్పడ్డారని ఈ నేపథ్యంలో రాష్ట్ర ఏర్పాటు కోసం కాంగ్రెస్ పార్టీని, బీజేపీని తాము ఒప్పించామని తదనంతరం పార్లమెంటు ఉభయసభల్లో బిల్లు పాస్ అయిందని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర విభజన రాజ్యాంగ విరుద్ధంగా, అశాస్త్రీయంగా జరిగిందని ఎలా అంటారని మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని స్పీకర్ ను డిమాండ్ చేశారు.

లైవ్ టీవి

Share it
Top