ఇంగ్లండ్‌కు ఇదే తొలి సారి

ఇంగ్లండ్‌కు ఇదే తొలి సారి
x
Highlights

ఐసీసీ వన్డే ప్రపంచకప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరుగుతన్న మ్యాచ్‌లో ఆతిథ్య ఇంగ్లండ్‌ భారీ స్కోర్‌ దిశగా పయనిస్తోంది. ఆ జట్టు స్టార్‌ ఓపెనర్‌ జేసన్‌...

ఐసీసీ వన్డే ప్రపంచకప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరుగుతన్న మ్యాచ్‌లో ఆతిథ్య ఇంగ్లండ్‌ భారీ స్కోర్‌ దిశగా పయనిస్తోంది. ఆ జట్టు స్టార్‌ ఓపెనర్‌ జేసన్‌ రాయ్‌ ఆకాశమే హద్దుగా చెలరేగుతూ.. బంగ్లా బౌలర్లకు చుక్కలు చూపించాడు. తాజా ప్రపంచకప్‌లో జేసన్‌ రాయ్‌(153;121 బంతుల్లో 14ఫోర్లు, 5 సిక్సర్లు) భారీ శతకం నమోదు చేయడంతో పాటు పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. కెరీర్‌లో తొమ్మిదో శతకం బాదిన రాయ్‌ తన సహచర ఆటగాడు జోయ్‌ రూట్‌ రికార్డును అధిగమించాడు.

అతితక్కువ ఇన్నింగ్స్‌ల్లో తొమ్మిది సెంచరీలు సాధించిన ఆటగాడిగా జోయ్‌ రూట్‌(78 ఇన్నింగ్స్‌లు) రికార్డును తాజాగా రాయ్‌(77 ఇన్నింగ్స్‌ల్లో) సవరించాడు. ఇక ఈ జాబితాలో దక్షిణాఫ్రికా ఆటగాడు హషీమ్‌ ఆమ్లా(52) తొలి స్థానంలో ఉన్నాడు. అంతేకాకుండా ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌ తరుపున అత్యధిక స్కోర్‌ నమోదు చేసిన రెండో బ్యాట్స్‌మెన్‌గా రాయ్‌ నిలిచాడు. ఈ జాబితాలో మాజీ లెఫ్టాండ్‌ బ్యాట్స్‌మన్‌ ఆండ్రూ స్ట్రాస్‌(158; 2011 ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్‌పై) తొలి స్థానంలో ఉన్నాడు. ఇప్పటికే తాజా ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌ మూడు శతకాలను(బట్లర్‌, రూట్‌, రాయ్‌) నమోదు చేసింది. అయితే ఇప్పటివరకు ప్రపంచకప్‌లో మూడు శతకాలు బాదడం ఇంగ్లండ్‌కు ఇదే తొలి సారి కావడం విశేషం

Show Full Article
Print Article
More On
Next Story
More Stories