మోత్కుపల్లికి గులాబీతీర్థం ఇచ్చేందుకు.. కీలకమంత్రి మంతనాలు ?

Submitted by arun on Wed, 05/30/2018 - 10:52
Motkupalli

టీటీడీపీ బహిష్కృత నేత మోత్కుపల్లి నర్సింహులు.. టీఆర్ఎస్‌లో చేరబోతున్నారా.? సడన్‌గా కేసీఆర్‌పై ప్రేమ పుట్టుకు రావటానికి కారణమేంటి.? మోత్కుపల్లికి గులాబీతీర్థం ఇచ్చేందుకు.. కీలకమంత్రి మంతనాలు సాగిస్తున్నారా.? ఆయన చేరిక టీఆర్ఎస్‌కు లాభమా.. నష్టమా..?

మొన్నటి వరకు కేసీఆర్ పాలన అంటే.. మోత్కుపల్లి నర్సింహులు ఒంటికాలిపై లేచేవారు. కానీ.. ఇప్పుడు సీన్ మొత్తం మారిపోయింది. ఇప్పుడు.. చంద్రశేఖరరావు పాలన భేష్ అంటున్నారు. కేసీఆర్‌పై రాజకీయ విమర్శలతో పాటు వ్యక్తిగత విమర్శలు చేసే మోత్కుపల్లి.. సడన్‌గా మెచ్చుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆయన మాటలే.. ఇప్పుడాయన టీఆర్ఎస్‌లో చేరబోతున్నారా అన్న సంకేతాలను ఇస్తున్నాయి.

6 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం ఉన్న మోత్కుపల్లి వంటి సీనియర్లు పార్టీలో ఉంటే.. విపక్షాల విమర్శలను తిప్పికొట్టొచ్చన్న అంచనాలో టీఆర్ఎస్ పెద్దలున్నట్లు తెలుస్తోంది. ఇటు మోత్కుపల్లికి కూడా ఏ పదవీ లేదు. వచ్చే ఎన్నికల్లో గెలవకపోయినా.. టీఆర్ఎస్‌లో చేరితో బాగుంటుందనుకుంటున్నారు. టీడీపీలో ఉన్నప్పుడు.. కేసీఆర్, మోత్కుపల్లికి మంచి అనుబంధముంది. అందుకే టీఆర్ఎస్‌లో చేరాలన్న యోచనలో మోత్కుపల్లి ఉన్నారు. దీనిని గ్రహించిన మంత్రి కేటీఆర్.. వెంటనే రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే టికెట్ హమీ లేకుండానే ఆయనను పార్టీలో చేర్చుకునేందుకు ఒప్పించే ప్రయత్నం చేసినట్లు పార్టీలో చర్చ నడుస్తోంది. ఐతే.. దీనిపై మరింత స్పష్టత రావాల్సి ఉంది. అందుకే.. మోత్కుపల్లి పార్టీ మార్పుపై ఎలాంటి వ్యాఖ్యలు చేయడం లేదు. సమయం వచ్చినప్పుడు చెబుతానని.. సమాధానాలు దాట వేస్తున్నారు. ఇదిలా ఉంటే.. వారం క్రితమే కేటీఆర్, మోత్కుపల్లితో చర్చలు జరిపారని టీఆర్ఎస్‌లో ప్రచారం జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో..మోత్కుపల్లి సేవలను వినియోగించుకుని.. తర్వాత ఆయన స్థాయికి తగ్గట్ల పదవి ఇచ్చే ఆలోచనలో ఉంది అధిష్టానం.

English Title
Motkupalli Narasimhulu to Join TRS?

MORE FROM AUTHOR

RELATED ARTICLES