రేవంత్‌రెడ్డిపై టీడీపీ నేత మోత్కుపల్లి సంచలన వ్యాఖ్యలు

Submitted by arun on Fri, 03/02/2018 - 13:40
motkupalli

తెలుగుదేశం పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో ఇటీవల చేరిన రేవంత్‌రెడ్డిపై మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... ఓటుకు నోటు కేసుతో రేవంత్‌ తెలుగుదేశం పార్టీ పరువు తీశారన్నారు. రేవంత్‌రెడ్డిని ఆనాడే సస్పెండ్‌ చేసి ఉంటే తెలంగాణలో పార్టీ బతికేది అని మోత్కుపల్లి అన్నారు. ‘టీఆర్‌ఎస్‌తో రేవంత్‌‌రెడ్డికి వైరం ఉండొచ్చు... కానీ నాకు లేదు’ అని మోత్కుపల్లి అన్నారు. తెలంగాణలో టీడీపీకి సరైన నాయకత్వం లేదని ఆరోపించారు మోత్కుపల్లి నర్సింహులు. కమిట్మెంట్ లేనివాళ్లకి నాయకత్వ బాధ్యతలు అప్పగించడం వల్ల పార్టీ భ్రష్టు పట్టిందన్నారు. అధినేత చంద్రబాబు తెలంగాణకు రావాల్సిందేనని కుండబద్దలు కొట్టేశారు. పదవి ఇచ్చినా ఇవ్వకపోయినా చంద్రబాబునాయుడుకి తాను తమ్ముడినేనని అన్నారు. తాను లేకుండా పార్టీలో మీటింగ్ పెడతారా అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు సంధించారు.


 

English Title
motkupalli narasimhulu fire on revanth reddy

MORE FROM AUTHOR

RELATED ARTICLES