రాజమ్మ కన్నీటి వ్యధ

x
Highlights

నవమాసాలు మోసి, పిల్లల్ని కని, పెంచి పెద్దచేసిన ఆ పెద్దవ్వకు కొండంత కష్టమొచ్చింది. నా అనే వాళ్లే లేక, పని చేసుకునే ఓపిక లేక, కనికరించే వారే లేక కంట...

నవమాసాలు మోసి, పిల్లల్ని కని, పెంచి పెద్దచేసిన ఆ పెద్దవ్వకు కొండంత కష్టమొచ్చింది. నా అనే వాళ్లే లేక, పని చేసుకునే ఓపిక లేక, కనికరించే వారే లేక కంట కన్నీరు పెడుతుంది. దిక్కుతోచని స్థితిలో దిక్కులు పిక్కటిల్లేలా రోధిస్తున్న అమ్మపై హెచ్‌ఎంటీవీ స్పెషల్‌ స్టోరీ.

ఆమె పేరు... రాజమ్మ. వయస్సు 90కి పైగా ఉంటాయి. ఆ వయస్సులో పిల్లలు, మనవళ్లు, మనవరాళ‌్లతో గడపుతుంటారు. అయిన వాళ్ల ఆప్యాయత, అనురాగాల మధ్య గడపాలనుకుంటారు. కానీ వీటన్నిటికి దూరమై... చెత్తకుప్పల మధ్య జీవనం సాగిస్తుంది ఆ పండుటాకు.

వరంగల్‌‌కి చెందిన రాజమ్మకి సుమారు 90ఏళ్లకు పైగా ఉంటాయి. ఆమెకు నలుగురు సంతానం. కొడుకులు అర్థాంతరంగా తనువు చాలించారు. ఉన్న ఒక్క కూతురు అత్తగారింటికి పరిమితమయ్యింది. దీంత రాజమ్మకి నా అనే వాళ్లు లేకుండా పోయారు. ఈక్రమంలో కూతురు రత్నమాల తల్లిని చెత్తకుప్పల దగ్గర ఉన్న ఓ పాత డబ్బాలో ఉంచారు.

కొడుకును ఉన్నత స్థితికి చేరి తల్లిని బాగా చూసుకోవాల్సిన వయస్సులో తనువు చాలించడంతో ఆ తల్లి మనోవేదన అంతా ఇంతా కాదు. అటు కొడుకులు చనిపోయి ఇటు ఉన్న ఒక్క కూతురు ఆర్థిక పరిస్థితి సరిగా లేక అవ్వను సరిగా పట్టించుకోకపోవడంతో రాజమ్మ అనాధలా మారింది. అయితే కన్న కూతురే ఆ బంకును కొని కన్న తల్లి రాజమ్మను అక్కడ ఉంచినట్టు స్థానికులు చెప్తున్నారు. ఇలా అవ్వను నాలుగేళ్లుగా చూస్తున్నామని స్థానికులు చెప్తున్నారు. ఇలాంటి పరిస్థితి చూడలేక తమకు తోచినంత సహాయం చేస్తున్నామని స్థానికులు తెలిపారు.

రాజమ్మ దీన స్థితిపై స్థానికులు చలించిపోయి కూడు, గూడు కల్పించాలని కొన్ని ఆశ్రమాలను సంప్రదించారు. కానీ కూతురు ఉందన్న కారణంతో ఆశ్రమ నిర్వాహకులు అవ్వను అక్కున చేర్చుకునేందుకు నిరాకరిస్తున్నారని స్థానికులు వివరించారు. ఇప్పటికైనా అవ్వను ఎవరైనా ఆదరిస్తే బాగుంటుందని అక్కడి వారంతా కోరుతున్నారు. కూతురిని వంకగా చూపించి రాజమ్మను ఆశ్రమ నిర్వాహకులు నిరాకరించడం సరికాదని అంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories