వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని..

Submitted by arun on Tue, 09/11/2018 - 12:06
Fornication Relationship

హైదరాబాద్‌లో ఓ కసాయి తల్లి తన కన్న కూతురి పట్ల పైశాచికంగా ప్రవర్తించింది. వివాహేతర సంబంధానికి అడ్డువస్తుందనే కారణంతో కన్న కూతురుకి నరకం చూపించింది. కసాయి తల్లి క్రూరత్వాన్ని గమనించిన స్థానికులు ఎల్బీనగర్ మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి సమాచారం అందించారు. వెంటనే స్పందించిన సుధీర్ రెడ్డి బాలల హక్కుల సంఘానికి ఫిర్యాదు చేసి పాపను కాపాడారు. కసాయి తల్లి సరితను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మలక్‌పేట ఇన్‌స్పెక్టర్ దేవెందర్ తెలిపిన కథనం ప్రకారం... నల్గొండ మోత్కూర్‌కు చెందిన ముఖావలి సరిత(25)కు నల్గొండకు చెందిన వెంకన్న యాదవ్‌తో ఏడేళ్లక్రితం వివాహం జరుగగా, వారికి పాప (రేణుక)జన్మించింది. అయితే అప్పటికే వెంకన్న మరో పెళ్లిచేసుకున్నట్లు సరితకు తెలియడంతో వారి కుటుంబంలో కలహాలు మొదలయ్యాయి. దీంతో ఆరు నెలలక్రితం భర్తను వదిలేసి నగరానికి వచ్చిన సరిత మూసారాంబాగ్ ఈస్ట్ ప్రశాంత్‌నగర్‌లోని ఓ ఇంట్లో ఉంటూ పాచిపనులు చేస్తూ జీవిస్తుంది. అదే ప్రాంతంలో నివాసముండే డీసీఎం డ్రైవర్ వెంకట్‌రెడ్డితో అక్రమ సంబంధాన్ని కొనసాగిస్తూ కలిసి ఒకేఇంట్లో ఉంటున్నారు. ప్రియుడి మోజులోపడిన సరిత తమ లైంగిక సుఖానికి అడ్డుగా ఉందన్న నేపంతో ప్రియుడితో కలిసి కూతురు రేణుక(3)ను చిత్రహింసలకు గురిచేస్తుంది. బాలిక వీపు, చేతులపై కాల్చి వాతలు పెట్టిన సరిత, ఎడమ చెయ్యి విరగ్గొట్టింది. బాలిక పెదవులను కొరికి తీవ్రంగా గాయపరిచింది. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న చైల్డ్‌లైన్ అధికారులు, బాలల హక్కుల సంఘం ప్రతినిధులు సోమవారం సాయంత్రం ఈస్ట్ ప్రశాంత్‌నగర్‌లోని సరిత ఉంటున్న నివాసానికి చేరుకుని వారి వేధింపుల నుంచి చిన్నారిని రక్షించారు.

English Title
mother harassments child hyderabad

MORE FROM AUTHOR

RELATED ARTICLES