చిన్న పాపపై ఈ కోతి చేసిన పని చూస్తే..

Submitted by nanireddy on Wed, 07/11/2018 - 19:45

మామూలుగానే కోతికి తిక్క ఎక్కువ అలాంటిది తనకు దక్కాల్సిన ఆహరం అందకపోతుంటే ఊరుకుంటుందా.. చైనాలో తల్లీకూతుళ్లు ఓ జూపార్క్ వెళ్లారు. అక్కడ ఓ కోతి కనిపించింది. దాంతో వారిద్దరూ  కోతికి ఆహారంగా పల్లీలు పెడుతున్నారు.కోతి చక్కగా వాటిని ఆరగించేస్తోంది. ఇంతలో ఆమె కుమార్తె కూడా తనకూ పల్లీలు కావాలంటూ చేయి చాచింది. అయితే ఇంతలోనే పల్లీలు అయిపోయాయి. దీంతో ఆ వానరానికి ఎక్కడాలేని కోపం వచ్చింది. దీంతో అది ఆ చిన్నారి చెంపపై ఒక్కటిచ్చుకుంది. దీంతో ఆ పాప కింద పడిపోయింది. వైరల్‌గా మారిన ఈ వీడియోను చైనా గ్లోబల్ టీవీ నెట్ వర్క్ షేర్  చేయగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 

English Title
monkey-punches-girl-face-china-video

MORE FROM AUTHOR

RELATED ARTICLES