కొంప‌ముంచిన వివాహేతర సంబంధాలు

కొంప‌ముంచిన వివాహేతర సంబంధాలు
x
Highlights

టీమిండియా ఫాస్ట్ బౌలర్, బెంగాల్ ఎక్స్ ప్రెస్ మహ్మద్ షమీ కోరి కష్టాలు తెచ్చుకొన్నాడు. పండంటి బిడ్డ, అందమైన భార్య ఉండగా వివాహేతర సంబంధాలతో అసలుకే ఎసరు...

టీమిండియా ఫాస్ట్ బౌలర్, బెంగాల్ ఎక్స్ ప్రెస్ మహ్మద్ షమీ కోరి కష్టాలు తెచ్చుకొన్నాడు. పండంటి బిడ్డ, అందమైన భార్య ఉండగా వివాహేతర సంబంధాలతో అసలుకే ఎసరు తెచ్చుకొన్నాడు. చివరకు కట్టుకొన్న భార్య కేసు పెట్టడంతో షమీ క్రికెట్ కెరియర్ గాల్లో దీపంలా మారింది. బెంగాల్ కు చెందిన 27 ఏళ్ల మహ్మద్ షమీ భారత క్రికెట్లోని అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్లలో ఒకడు. ఐదేళ్ల క్రితం భారతజట్టులోకి దూసుకొచ్చిన షమీ ఇప్పుడు కీలక బౌలర్ గా మారాడు. ఇటు టెస్టులు అటు వన్డేల్లో టీమిండియాకు తన మెరుపు ఫాస్ట్ బౌలింగ్ తో ఎన్నో ఒంటిచేతి విజయాలు అందించాడు.

భారతజట్టు సభ్యుడిగా తన ఐదేళ్ల కెరియర్ లో ఇటీవలి సౌతాఫ్రికా సిరీస్ వరకూ 30 టెస్టులు ఆడిన షమీకి 110 వికెట్లు పడగొట్టిన రికార్డు ఉంది. అంతేకాదు 50 వన్డేల్లో 91 వికెట్లు, ఏడు టీ-20 మ్యాచ్ ల్లో 8 వికెట్లు సాధించిన అసాధారణ రికార్డు ఉంది. అంతేకాదు ఐపీఎల్ లో ఢిల్లీ డేర్ డెవిల్స్, కోల్ కతా నైట్ రైడర్స్ జట్ల లో కీలక సభ్యుడు కూడా.

ఐపీఎల్ లో కోల్ కతా నైట్ రైడర్స్ కు ఆడుతున్న సమయంలోనే షమీకి మోడల్ కమ్ చీర్ గాళ్ రూపంలో పరిచయమైన హసీన్ జమీన్ ను ప్రేమించి మరీ తన జీవితభాగస్వామిగా చేసుకొన్నాడు. గత నాలుగేళ్ల
షమీ సంసార జీవితంలో ఓ పండంటి పాప సైతం భాగస్వామిగా ఉంటూ వస్తోంది. ఇటు టీమిండియా సభ్యుడిగా అటు ఐపీఎల్ ద్వారా సంపాదించిన ఆదాయంతో షమీ కేవలం కొద్ది సంవత్సరాల కాలంలోనే
కోటీశ్వరుడుగా మారాడు. విలాసవంతమైన జీవితానికి అలవాటు పడ్డాడు.

తన భార్యతో ఎంతో ప్రేమగా ఉంటూ వచ్చిన షమీకి సౌతాఫ్రికా పర్యటన ముగియడంతోనే కష్టాలు ప్రారంభమయ్యాయి. కోల్ కతాలోని లాల్ బజార్ స్టేషన్లో షమీపై అతని భార్య గృహహింస కేసు పెట్టే వరకూ
పరిస్థితి దారితీసింది. షమీ తనను శారీరకంగా, మానసికంగా వేధించడమే కాక వివాహేతర సంబంధాలతో మోసం చేశాడంటూ షమీ భార్య హసీన్ జహాన్ ఆరోపించింది. సౌతాఫ్రికా టూర్ నుంచి వచ్చిన వెంటనే కుటుంబసభ్యుల మాటలు విని షమీ తనపైన చేయి చేసుకొన్నాడని అప్పటి నుంచి శారీరకంగా, మానసికంగా హింసిస్తూ వస్తున్నాడని వాపోయింది.

షమీ ఫేస్ బుక్ అకౌంట్ చూస్తే పలువురు యువతులతో అక్రమసంబధం ఉందని తనకు అర్థమయ్యిందని అదేమని అడిగితే తనపై కుటుంబసభ్యులతో కలసి దౌర్జన్యం చేశాడని తప్పులు సరిదిద్దుకోమని అవకాశమిస్తే తనను చంపడానికి ప్రయత్నించాడంటూ తీవ్రమైన ఆరోపణలు చేసింది. కోల్ కతా లాల్ బజార్ స్టేషన్ కు వెళ్లి పోలీసులకు తగిన ఆధారాలు అందించడమే కాదు కేసు కూడా బుక్ చేసింది.

మరోవైపు షమీ మాత్రం తన పేరు ప్రతిష్టలకు భంగం కలిగించడానికి జరుగుతున్న కుట్రలో ఇదో భాగమని తన భార్యకు పిచ్చిపట్టినట్లుందని తాను ఫోను చేసినా సమాధానం చెప్పడం లేదని వాపోయాడు. అంతేకాదు బీసీసీఐ సైతం మహ్మద్ షమీ వార్షిక కాంట్రాక్టును సస్పెన్షన్ లో ఉంచింది. తనకుటుంబాన్ని చక్కదిద్దుకొంటనే షమీ కాంట్రాక్టు పునరుద్దరిస్తామని తేల్చి చెప్పింది. అంతేకాదు భారతజట్టులో షమీ చోటు సైతం గాల్లో దీపంలా మారింది. ఒకవేళ షమీ తన భార్యతో సమస్యలను పరిష్కరించుకోలేకపోతే కెరియర్ తో పాటు కోట్లరూపాయల ఆదాయం కూడా నష్టపోయే ప్రమాదం కూడా లేకపోలేదు.

Image result for mohammed shami

Show Full Article
Print Article
Next Story
More Stories