ఫలించిన నిరీక్షణ...53 గంటల తర్వాత తల్లి ఒడికి చిన్నారి

ఫలించిన నిరీక్షణ...53 గంటల తర్వాత తల్లి ఒడికి చిన్నారి
x
Highlights

53 గంటల నిరీక్షణ ఫలించింది. HMTV ప్రయత్నం సఫలమైంది. ఎట్టకేలకు కామారెడ్డిలో పసిపాప ఆచూకీ లభ్యమైంది. రెండు రోజులు గడుస్తున్నా పాప ఎక్కడ ఉందో తెలియక...

53 గంటల నిరీక్షణ ఫలించింది. HMTV ప్రయత్నం సఫలమైంది. ఎట్టకేలకు కామారెడ్డిలో పసిపాప ఆచూకీ లభ్యమైంది. రెండు రోజులు గడుస్తున్నా పాప ఎక్కడ ఉందో తెలియక కన్నపేగు తల్లడిల్లిపోయింది. తన పాపను తనకు అప్పగించాలంటూ ఆ తల్లి గుండెలవిసేలా రోధించింది. అయితే పాప ఆచూకీ తెలియడంతో తల్లి ఆనందానికి అవధుల్లేవు.

సంగారెడ్డి ప్రభుత్వాస్పత్రిలో మంగళవారం ఉదయం అదృశ్యమైన పాప కోసం మమ్మరంగా అన్వేషణ కొనసాగింది. పాప మిస్సింగ్ వ్యవహారాన్ని సంగారెడ్డి పోలీసులు సవాల్ గా తీసుకున్నారు. చిన్నారి కోసం 570 మంది పోలీసులు బృందాలుగా ఏర్పడి గాలించారు. మెదక్ జిల్లా మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు సరిహద్దుగా ఉండటంతో అక్కడ కూడా పాప కోసం అన్వేషణ కొనసాగించారు. చివరికి పోలీసులు పాప ఆచూకీ కనిపెట్టారు.

సంగారెడ్డి ప్రభుత్వాస్పత్రిలో అదృశ్యమైన పాప ఫొటోతో ఉన్న పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఉమ్మడి మెదక్ జిల్లాతో పాటు సరిహద్దు జిల్లాల్లో.. పాప పోస్టర్ ను అంటించారు. ఆచూకీ తెలిపిన వారికి 50 వేలు క్యాష్ రివార్డు ఇస్తామని సంగారెడ్డి ఎస్పీ తెలిపారు. HMTV వరుస కథనాలు, లక్షలాది మంది ప్రజల వేడుకోలు, పోలీసుల అన్వేషణ కలిసి పాప ఆచూకీ తెలిసేలా చేశాయి.

పాప మిస్సింగ్ కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా విచారణ చేపట్టారు. ఎవరి కంటా పడకుండా, పాపన ఎలా తీసుకెళ్లారు..? అసలు ఎవరు తీసుకెళ్లారు..? ఎక్కడికి తీసుకెళ్లారు అనే కోణంలో విచారణ జరిపారు. తెలంగాణతో పాటు, మహారాష్ట్ర, కర్ణాకటలో ముమ్మరం గాలింపు చేపట్టారు. చివరికి పోలీసుల ప్రయత్నం విఫలం కాలేదు. ఎట్టకేలకు కామారెడ్డిలో పాప ఆచూకీ లభించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories