అనంత టీడీపీలో భగ్గుమన్న విభేదాలు

Submitted by arun on Thu, 10/11/2018 - 17:05
tdp

అనంతపురం జిల్లా టీడీపీలో నేతలు విబేధాలు తీవ్రమయ్యాయి. రాయదుర్గంలో సీఎం చంద్రబాబు పర్యటించిన మరుసటి రోజే నేతల మధ్య విబేధాలు భగ్గుమన్నాయి. మంత్రి కాల్వ శ్రీనివాసులు తీరుపై ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి మండిపడ్డరు. రాయదుర్గం టీడీపీ కంచుకోటని, మంత్రి వైఖరి వల్ల చాలా ఇబ్బందిగా ఉందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్నా తనను పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదని దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పారు. మంత్రి కాల్వ తప్పుడు ప్రచారం చేస్తే సహించేది లేదన్నారు. పార్టీలో నుంచి తప్పించాలని చూస్తున్నారని, అది నీ వల్ల కాదని  దీపక్‌రెడ్డి మంత్రికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. 
 

English Title
mlc deepak reddy fire on minister kalva srinivasulu

MORE FROM AUTHOR

RELATED ARTICLES