అప్పుడు కొలరాడో..ఇప్పుడు కాళేశ్వరం...ప్రపంచంలోనే మహా జల అద్భుతం

అప్పుడు కొలరాడో..ఇప్పుడు కాళేశ్వరం...ప్రపంచంలోనే మహా జల అద్భుతం
x
Highlights

లిఫ్ట్‌ ఇరిగేషన్‌. అంటే వ్యవసాయం కోసం నీటిని ఎత్తిపోయడం. గ్రావిటీ ద్వారా నీరు ప్రవహించలేని ప్రాంతాలకు నీటిని తరలించడం. ప్రపంచవ్యాప్తంగా లిఫ్ట్‌...

లిఫ్ట్‌ ఇరిగేషన్‌. అంటే వ్యవసాయం కోసం నీటిని ఎత్తిపోయడం. గ్రావిటీ ద్వారా నీరు ప్రవహించలేని ప్రాంతాలకు నీటిని తరలించడం. ప్రపంచవ్యాప్తంగా లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టులను కొన్ని నిర్మించారు. వాటిల్లో అమెరికాలోని కొలరాడో ఆ తర్వాత ఈజిప్టులోని గ్రేట్‌ మ్యాన్‌మేడ్‌ రివర్‌ ఎత్తిపోతల పథకంలో ప్రపంచ మేటి నిర్మాణాలు. ఆ అద్భుత ప్రాజెక్టులకు గీటురాయి కాళేశ్వరం.

నైరుతీ అమెరికా ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసిన కొలరాడో లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టు ప్రపంచ చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతుంది. ఇప్పుడు ఆ ఇంజనీరింగ్‌ అద్భుతాన్ని కాళేశ్వరం వెనక్కి నెట్టేసింది. కొలరాడో నది దక్షిణ దిశగా సుమారు 1400 మైళ్లు ప్రయాణిస్తోంది. కొలరాడో, ఉటావ్‌, ఆరిజోనా, కాలిఫోర్నియా మీదుగా పసిఫిక్‌ సముద్రంలో కలుస్తుంది. ఈ రాష్ర్టాల్లో కొన్ని ప్రాంతాలకు లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పద్ధతిలో నీటిని అందిస్తున్నారు. ఎత్తిపోతల పథకం ద్వారా జలాలను తరలించడంతో అక్కడ వ్యవసాయం పెరిగింది.

మొక్కజొన్న లాంటి పంటలు వేల హెక్టార్లలో పరుచుకుపోయాయి. వ్యవసాయానికి నీరు అందిచడమే కాదు, ఆయా రాష్ర్టాల్లో ఉన్న కొన్ని మహా నగరాలకు కూడా కొలరాడో నీటిని లిఫ్ట్‌ పద్ధతిలో తరలించారు. ఇప్పుడు ఆ గొప్ప నగరాలకు లిఫ్ట్‌ ద్వారా వచ్చిన నీరే ఆధారంగా మారింది. కృత్రిమంగా నీటిని మెట్ట ప్రాంతాలకు తరలించి అనేక అద్భుతాలు సృష్టించారు. కొలరాడో నది నీటిని వృధాపోనివ్వకుండా అనేక చర్యలు తీసుకున్నారు.

ప్రతి బొట్టూ ప్రతి అంగుళానికి ఉపయోగపడేలా చేశారు. ఇంజినీరింగ్‌ అద్భుతంతో ఎత్తు ప్రదేశాలకు నీటిని తరలించారు. నది కింద ఉన్న బేసిన్‌ ప్రాంతం ఒక్కటే కాదు ఎడారి ప్రాంతమైన ఆరిజోనాలో వ్యవసాయం ఇప్పుడు ఓ పండుగలా సాగుతోంది. మెక్సికో బోర్డర్‌ వద్ద కూడా లిఫ్ట్‌ ద్వారా వచ్చిన కొలరాడో నీటిని సద్వినియోగం చేసుకుంటున్నారు. కొలరాడో లిఫ్ట్‌ స్కీమ్‌ ఒకరకంగా ఎడారి ప్రాంతాన్ని పచ్చని ప్రదేశంగా మార్చింది. వాటర్‌ మేనేజ్‌మెంట్‌కు కొలరాడో ప్రపంచదేశాలకు ఓ ఉదాహరణగా నిలిచింది.

కాలిఫోర్నియా-ఆరిజోనా బోర్డర్‌ వద్ద సుమారు 242 మైళ్ల మేరకు కొలరాడో నది నీటిని ఎత్తిపోస్తారు. అక్వాడక్ట్‌ పద్ధతిలో ఈ ప్రక్రియ జరుగుతుంది. ఇప్పడు కాళేశ్వరం కూడా ఇలాంటి అమోఘ ఫలితాలను తెలంగాణ ప్రజలకు అందివ్వనుంది. మేడిగడ్డ నుంచి ఎత్తి పోసిన నీరు ఇప్పుడు మహానగరం హైదరాబాద్‌ వరకు చేరుకోనుంది. లక్షల ఎకరాల్లో పంటపొలాలను తడుపనుంది. ఇన్నాళ్లూ బీడువారిన ఉత్తర తెలంగాణ భూములన్నీ ఇప్పడు కాళేశ్వరం ఎత్తిపోతల పథకంతో కళకళలాడనున్నాయి.

కాళేశ్వరం లిఫ్ట్‌ ఇరిగేషన్‌ స్కీమ్‌ ద్వారా తొలి దశలో సుమారు 45 లక్షల ఎకరాలకు రెండు పంటలకు సరిపడా నీరు అందుతుంది. మిషన్‌ భగీరధ ద్వారా సుమారు 40 టీఎంసీల తాగునీటిని అందిచనున్నారు. ఇంతకుముందు అమెరికాలోని కొలరాడో ఇప్పుడు కాళేశ్వరం. ఈజిప్టు దేశంలోని గ్రేట్ మ్యాన్ మేడ్ రివర్ ఎత్తిపోతల పథకాలు ప్రపంచంలోని అతిపెద్ద ఎత్తిపోతల పథకాలుగా నిలిచాయి.

ఈ రెండింటిని అధిగమించి ఇప్పుడు కాళేశ్వరం పేరు చరిత్రలోకి ఎక్కనుంది. కొలరాడో రివర్‌ అక్వాడక్ట్‌ ప్రతి సెకనుకు 1600 క్యూబిక్‌ ఫీట్ల నీటిని సుమారు 1600 ఫీట్ల ఎత్తుకు ఎత్తిపోస్తున్నది. ఈ ప్రయానంలో ఆ నీరు అనేక ఎడారి కొండలను దాటి వెళ్తుంది. మాడ్రన్‌ సివిల్‌ ఇంజినీరింగ్‌లో కొలరాడో లిఫ్ట్‌ ఇరిగేషన్‌ నిర్మాణాలను అమెరికా సివిల్‌ ఇంజినీర్లు అద్భుతంగా భావిస్తారు. ఇప్పడు కాళేశ్వరం కూడా ఇలాంటి అమోఘ ఫలితాలను తెలంగాణ ప్రజలకు అందివ్వనుంది. మేడిగడ్డ నుంచి ఎత్తి పోసిన నీరు ఇప్పుడు మహానగరం హైదరాబాద్‌ వరకు చేరుకోనుంది.

లక్షల ఎకరాల్లో పంటపొలాలను తడిపి ఇన్నాళ్లూ బీడువారిన ఉత్తర తెలంగాణ భూములన్నీ ఇప్పడు కాళేశ్వరం ఎత్తిపోతల పథకంతో కళకళలాడనున్నాయి. కొలరాడో లిఫ్ట్‌ స్కీమ్‌ అమెరికా చరిత్రను మార్చేసింది. ఇప్పుడు సీఎం కేసీఆర్‌ అకుంఠిత దీక్షతో నిర్మించిన కాళేశ్వరం తెలంగాణ రైతులను సుసంపన్నం చేయనుండటమే కాదు తెలంగాణ దాహార్తిని తీర్చునున్నది. రైతు రాజ్యాన్ని స్థాపించ‌నుందని టీఆర్ఎస్‌ వర్గాలు చెబుతున్నాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories