పవన్‌కు గుండు కొట్టింది నిజమే: రోజా

పవన్‌కు గుండు కొట్టింది నిజమే: రోజా
x
Highlights

పవన్ కల్యాణ్ పై వైసీపీ ఎమ్మెల్యే రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో పరిటాల రవి పవన్ కల్యాణ్ కు గుండు కొట్టించారనే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే....

పవన్ కల్యాణ్ పై వైసీపీ ఎమ్మెల్యే రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో పరిటాల రవి పవన్ కల్యాణ్ కు గుండు కొట్టించారనే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆ వార్తను ఖండిస్తూ తనకు ఎవరు గుండు కొట్టించలేదని..తనకు తాను గుండు కొట్టించుకున్నానని పవన్ తెలిపారు. ఈ వ్యవహారంపై టీడీపీ నేతలు ప్రచారం చేశారని అన్నారు.

ఇదిలా ఉంటే ఓ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడిన రోజా పవన్ కల్యాణ్ కు గుండు కొట్టించిన మాటవాస్తవమేనన్నారు. అప్పుడే కాదు 2014కొట్టించారు. 2019లో కూడా మళ్లీ కొట్టిస్తారని సెటైర్ వేశారు. గతంలో టీడీపీలోనే ఉన్నానని, అయితే ఆ విషయంలో తనకు ఎటువంటి సంబంధమూ లేదని తేల్చిచెప్పారు. పవన్ చెప్పిన తేదీలను బట్టి చూస్తే గుండు నిజమేనని నమ్మొచ్చన్నారు.పవన్ కల్యాణ్ ఈ విషయం తెలుసుకుని టీడీపీతో జాగ్రత్తగా ఉంటే మేలని సూచించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories