ఎమ్మెల్యే రోజా అరెస్ట్.. ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన ఎమ్మెల్యే

Submitted by arun on Tue, 07/24/2018 - 10:33
roja

ఏపీకి ప్రత్యేక హోదా కోసం... వైసీపీ బందులో ఆ పార్టీ నాయకురాలు ఎమ్మెల్యే రోజాను ముందస్తు అరెస్ట్‌ చేశారు. చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలోని పుత్తూరు పోలీస్‌‌లు రోజాను స్టేషన్‌కి తరలించారు. అరెస్ట్‌ సందర్భంగా కొద్దిసేపు కార్యకర్తలు స్టేషన్‌ ముందు ధర్నా చేపట్టారు. అయితే 144 సెక్షన్‌లో భాగంగా కార్యకర్తలని పోలీసులు చెదరగొట్టారు. అంతకన్నా ముందు నెల్లూరు ఎమ్మెల్యే నారాయణస్వామిని కూడా అరెస్ట్‌ చేశారు. ప్రత్యేక హోదా కోసం బంద్ పాటిస్తుంటే అరెస్టులు చేయటం సిగ్గుచేటని రోజా నిప్పులు చెరిగారు. చంద్రబాబు ఆదేశాలతో పోలీసులు ఉద్యమాన్ని అణచి వేయాలని చూడటం నీచమైన చర్య అని మండిపడ్డారు. ప్రత్యేక హోదా కావాలని చంద్రబాబుకు లేదన్నారు. ఢిల్లీలో బీజేపీతో చంద్రబాబు లాలూచీ పడ్డారని ధ్వజమెత్తారు. అవినీతిలో టీడీపీ కూరుకు పోయిందన్నారు.

English Title
MLA Roja arrest In Puttor

MORE FROM AUTHOR

RELATED ARTICLES