ఏపీ మంత్రికి అధికారులు షాక్..

ఏపీ మంత్రికి అధికారులు షాక్..
x
Highlights

మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి అధికారులు భారీ షాక్‌ ఇచ్చారు. ఏపీలో ఎన్నికల కోడ్ సమీక్షల వివాదం మరోమారు తెరపైకొచ్చింది. మంత్రి సోమిరెడ్డి...

మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి అధికారులు భారీ షాక్‌ ఇచ్చారు. ఏపీలో ఎన్నికల కోడ్ సమీక్షల వివాదం మరోమారు తెరపైకొచ్చింది. మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నిర్వహించిన సమీక్షకు అధికారులు ఎవరూ హాజరుకాలేదు. రాష్ట్రంలో అకాల వర్షాలు, కరువు పరిస్థితులపై సమీక్షా సమావేశానికి హాజరుకావాలంటూ వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్‌, ప్రత్యేక కమిషనర్‌ మురళీధర్‌రెడ్డికి మంత్రి కార్యాలయం సమాచారం కూడా అందించింది. మీటింగ్‌ సమయం ఉదయం 11 గంటలా 30 నిమిషాల వరకు మంత్రి సోమిరెడ్డి సచివాలయానికి వచ్చారు. 3 గంటల పాటు వేచి చూసినా అధికారులు మాత్రం సమావేశానికి రాలేదు.

అయితే సమీక్షా సమావేశానికి సంబంధించిన స్పష్టత కోసం అధికారులు ఈసీని సంప్రదించినట్లు తెలుస్తోంది. దీంతో సమావేశానికి అధికారులు రాలేదు. దీంతో అధికారుల కోసం చాలా సమయం వేచి చూసిన మంత్రి సోమిరెడ్డి అసహనంతో వెనుదిరిగారు. తన సమీక్షను అడ్డుకుంటే మంత్రి పదవి నుంచి తప్పుకుంటానని అవసరమైతే సుప్రీంకోర్టుకు కూడా వెళ్తానని ప్రకటించారు. దీంతో ఇవాళ్టి సమీక్షా సమావేశం జరగకపోవడంతో మంత్రి తీసుకునే నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Show Full Article
Print Article
Next Story
More Stories